పట్టపగలే చిరుతకు చుక్కలు చూపించిన బబూన్స్

ఐక్యమత్యమే మహాబలం అని ఈ బాబూన్లు మరోసారి రుజువు చేశాయి. ఆకలి తీర్చుకుందామని దాడిచేసిన చిరుతపై అటాక్ చేశాయి. అంతేకాదు ఆ చిరుతకే ముచ్చెమటలు పట్టించి పట్టపగలే చుక్కలు చూపించాయి. బతుకు జీవుడా అంటూ అడవిలోకి పరుగులు తీసిన దృష్యాలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

New Update
పట్టపగలే చిరుతకు చుక్కలు చూపించిన బబూన్స్

మందబలం చూసి కుక్క మొరిగినట్లు అనే సామెత గుర్తుందిగా..అయితే ఇక్కడ తమ గుంపును చూసుకొని ఒక కొండముచ్చు ఏకంగా చిరుతపులిపై ఖయ్యానికి కాలు దువ్వింది.వెంటనే బాబూన్లన్ని కలిసి చిరుతపై అటాక్‌ చేయడంతో బతుకు జీవుడా అంటూ చిరుత పరుగులు తీసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగా వైరల్‌ అవుతోంది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో ఓ అటవి ప్రాంతంలో చోటుచేసుకుంది.అడవి దారి గుండా ఉన్న రహదారిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఓ వ్యక్తి తన మొబైల్‌లో బంధించాడు.దాదాపు 50కి పైగా ఉన్నా బబూన్స్ సంఘటితంగా దాడిచేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వీడియోలో రోడ్డులో స్వల్పపాటి ట్రాఫిక్ జామ్ అయినట్లు స్పష్టంగా తెలుస్తుంది.

ముందుగా రోడ్డు మీదకు వచ్చిన బబూన్స్ ఆహారం వేటలో నిమగ్నం అయి ఉన్నాయి. ఎప్పటినుంచి మాటేసి ఉందో తెలియదు కానీ ఓ చిరుతపులి తన ఆకలి తీరుతుందని ఆశపడి ఉంటుంది. రుచికరమైన బబూన్‌ను వేటాడానికి అనువైన సమయం కోసం ఎదురుచూసింది. ఒక దాని వెంటపడింది. అది గమనించి మొదట అన్ని పరిగెత్తాయి. ఒక పంజ విసిరే సమయానికి గుంపులో నుంచి మరొక పెద్ద బబూన్ దానితో తీవ్రంగా తలపడింది. ఆ వెంటనే ఇంకొన్ని గుంపు చేరి సపోర్టు చేశాయి. అనుకున్నదొక్కటి అయినదొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్‌ పిట్టా అన్నట్లు అయ్యింది చిరుత పరిస్ధితి మరోసారి దేని జోలికి పోకుండా చేశాయి బబూన్స్.

పట్టపగలే చిరుతకు చుక్కలు చూపించిన బబూన్స్‌

అంతేకాదు చిరుతకు పట్టపగలే చుక్కలు చూపించాయి. అన్ని గుంపుగా చిరుతపై దాడి చేసి కరిచాయి. ఊపిరి సలపనీయకుండా బబూన్స్ గుమిగూడడంతో చిరుత చేసేదేమిలేక తోక ముడుచుకొని తన ప్రాణాలు దక్కితే చాలన్నట్లు అక్కడి నుంచి అడవిలోకి పరుగులు పెట్టింది. అయినా సరే కొద్ది దూరం చిరుతను వెంబడించాయి. అప్పటికే చిరుత అడవిలోకి జెట్‌ స్పీడ్‌లో వెళ్లిపోయింది. ఈ దృశ్యాలను రోడ్డుపై వాహనాలు నిలిపి ప్రయాణికులు వీక్షించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు