Indigo Flight: ఇండిగో సంస్థకు రూ.1.2 కోట్ల జరిమానా..ఎందుకంటే!

విమానం పక్కన కూర్చుని ప్రయాణికులు భోజనాలు చేస్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాగా..దానిని చూసిన బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ (బీసీఏఎస్‌) తీవ్రంగా పరిగణించింది. దీనికి సంబంధించి ఇండిగో విమాన సంస్థకు రూ. 1.2 కోట్లు జరిమానా విధించింది.

New Update
Indigo Flight: ఇండిగో సంస్థకు రూ.1.2 కోట్ల జరిమానా..ఎందుకంటే!

Indigo Flight: కొద్ది రోజుల క్రితం ముంబై ఎయిర్‌ పోర్టు(Mumbai Airport) లో రన్‌ వే (Run Way) పై విమానం పక్కన కూర్చొని ప్రయాణికులు భోజనం చేసిన ఘటన పై బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ (బీసీఏఎస్‌) తీవ్రంగా పరిగణించింది. ఈ నిర్వాకానికి పాల్పడిన దిగ్గజ విమానసంస్థ ఇండిగోకు (Indigo) రూ. 1.2 కోట్ల జరిమానా విధించింది.

ఇటీవల గోవా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని వాతావరణం అనుకూలించక ముంబైకి తిప్పడం జరిగింది. దాంతో అక్కడే ప్రయాణికులు కొన్ని గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఆ సమయంలో ప్రయాణికులకు భోజనాన్ని ఏర్పాటు చేశారు. అయితే విమానం పక్కనే రన్‌ వే పై కూర్చొని భోజనం చేశారు.

సోషల్‌ మీడియాలో వైరల్‌..

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఇప్పటికే ముంబై ఎయిర్‌ పోర్టుకి ఈ విషయం గురించి రూ. 30 లక్షలు జరిమానా విధించింది. ఈ వీడియో పై ఇండిగో, ముంబై విమానాశ్రయానికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా పొగమంచు కమ్మేస్తుంది. ఢిల్లీతో పాటు ముంబై లాంటి ప్రాంతాల్లో కూడా పొగమంచు బాధ చాలా ఎక్కువగా ఉంది.


దీంతో చాలా విమానాలు క్యాన్సిల్‌ అయ్యాయి. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని విమానాలు దారి మళ్లి నడుస్తున్నాయి. దీంతో చాలా మంది ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కొందరైతే పైలట్లు, ఎయిర్‌ హోస్టేస్‌ ల మీద దాడులు కూడా చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌ గా మారింది. విమానాలు ఆగి ఉండే స్థలంలో ప్రయాణికులు విమానం పక్కనే కూర్చొని నేల మీదే భోజనాలు చేస్తున్నారు. దానిని ఓ ప్రయాణికుడు వీడియో తీసి పోస్ట్‌ చేశారు. అది కాస్త వైరల్‌ అవ్వడంతో పాటు అధికారుల దృష్టికి వెళ్లింది. దాంతో విమాన సంస్థ ఇండిగోకు భారీ మొత్తంలో జరిమానా విధించడం జరిగింది.

Also read: శ్రీవారి భక్తులకు అలర్ట్‌..నేటి నుంచి సేవా, దర్శన టికెట్లు విడుదల!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Kitchen Tips: ఈ వేసవిలో మీ వంటగదిలో ఇవి తప్పనిసరిగా ఉండాలి

వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం అవసరం. వేడి, ఆహారం, చల్లనీరు ద్వారా వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా ఫ్రిజ్‌లో ఉల్లిపాయలు, వెల్లుల్లి, బంగాళదుంపలు, వంటివి నిల్వ చేయవద్దు. వీటిని వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో నిల్వ చేయాలని నిపుణులు చెబుతున్నారు.

New Update
Kitchen Tips

Kitchen Tips

Kitchen Tips: వేసవిలో వేడి కారణంగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంటుంది. వంట గదిలో ఉండేవారి పరిస్థితి అయితే దారుణం. కాబట్టి వేసవిలో వంటగదిలో ఉంచుకోవాల్సిన కొన్ని వస్తువులు ఉన్నాయి. వేడిగా, మురికిగా ఉన్న వంటగది తెగుళ్లు, క్రిములను ఆహ్వానించి ఆహార భద్రతను ప్రమాదంలో పడేస్తుంది. అందుకే ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ మనలో చాలా మంది శ్రద్ధ వహించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం చాలా అవసరం. అలాగే తాగడానికి శుభ్రమైన నీరు తీసుకోవడం చాలా ముఖ్యం. వేడి వల్ల ఆహారం ద్వారా, నీటి ద్వారా వ్యాధులు వస్తాయి. కాబట్టి వాటర్‌ ప్యూరిఫైయర్‌ను సరిగ్గా శుభ్రం చేయడం తప్పనిసరి.  తాగడానికి, వంట చేయడానికి లేదా ఉత్పత్తులను కడగడానికి శుభ్రమైన నీటిని మాత్రమే వాడండి.

ఆరోగ్యానికి అంత మంచిది కాదు:

మనలో చాలా మంది ఎండలోంచి వచ్చినప్పుడు చల్లటి నీరు తాగుతాం. దానికోసం చాలా మంది ఫ్రిజ్‌పై ఆధారపడతారు. కానీ ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఈ సమయంలో చల్లటి నీరు తాగడానికి మట్టి పాత్రలను ఉపయోగించడం ఉత్తమం. వేసవిలో వంటగదిలో వాసన ఎక్కువగా వస్తుంటుంది. ఇది అన్ని రకాల తెగుళ్లను ఆకర్షించడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. బొద్దింకలు, ఈగలు, చీమలు వెచ్చని, తేమతో కూడిన ప్రదేశాలలో వృద్ధి చెందే అవకాశం ఉంది. అందువల్ల ఎక్కువ హానికరం కాని సహజ పురుగుమందులను వాడాలి. అధిక వేడి వల్ల కొన్ని కూరగాయలు సాధారణం కంటే త్వరగా చెడిపోతాయి. 

ఇది కూడా చదవండి: టాయిలెట్లలో డ్యూయల్‌ ఫ్లష్‌లు ఎందుకు ఉంటాయి?

ముఖ్యంగా మనం ఫ్రిజ్ బయట ఉంచే ఉల్లిపాయలు, వెల్లుల్లి, బంగాళాదుంపలు వంటివి. సరిగ్గా నిల్వ చేయకపోతే అవి బూజు పట్టి కుళ్ళిపోయి మొలకెత్తుతాయి. బంగాళాదుంపలు, ఉల్లిపాయలను కలిపి నిల్వ చేయవద్దు. అవి త్వరగా చెడిపోయేలా చేసే వాయువులను విడుదల చేస్తాయి. ఎక్కువ కాలం చెడిపోకుండా ఉండటానికి బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో నిల్వ చేయండి. ఊరగాయలు తేమగా ఉండటం వల్ల అవి చాలా సున్నితంగా ఉంటాయి. శుభ్రమైన, గాలి చొరబడని గాజు పాత్రలను ఉపయోగించండి. దీంతో అవి ఎక్కువ కాలం సురక్షితంగా, పాడవకుండా ఉంటాయి. మెటల్ మూతలు వాడకూడదు. ఎప్పుడూ కంటైనర్లను పూర్తిగా ఆరబెట్టాలని నిపుణులు అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: తిరుమల ఘాట్ రోడ్డులో బోల్తా పడ్డ సుమో.. స్పాట్లో ఏడుగురు!

( kitchen-tips | easy-kitchen-tips | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )

Advertisment
Advertisment
Advertisment