Group-1 Prelims: గ్రూప్1 ప్రశ్నల సరళిపై ఉద్యమకారుల ఆందోళన.. టీజీపీఎస్సీ తీరుపై ఫైర్!

తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్ లో ప్రశ్నల సరళిపై ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం, త్యాగాలు, సంస్కృతిని గురించి ప్రశ్నలు అడగకుండా రేవంత్ సర్కార్ అవమానించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలకోసం ఆర్టికల్ లోకి వెళ్లండి

New Update
Group-1 Prelims: గ్రూప్1 ప్రశ్నల సరళిపై ఉద్యమకారుల ఆందోళన.. టీజీపీఎస్సీ తీరుపై ఫైర్!

TGPSC: తెలంగాణలో గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. 563 పోస్టులకుగానూ టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 897 కేంద్రాల్లో 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించగా.. 3.02 లక్షల మంది (దాదాపు 74%) హాజరైనట్లు టీజీపీఎస్సీ తెలిపింది. త్వరలోనే ఈ పరీక్షకు సంబంధించిన కీ అధికారిక వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచబోతున్నామని, గ్రూప్‌-1 మెయిన్స్ అక్టోబరు 21 నుంచి మొదలవుతాయని స్పష్టం చేసింది.

తెలంగాణ ఉద్యమం, కల్చర్ కు అవమానం..
ఇదిలావుంటే.. ఇందులో అన్ని రంగాల నుంచి ప్రశ్నలు అడిగినప్పటికీ.. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అంశాలు ఒక్కటికూడా అడకడపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ వర్తమాన వ్యవహారాలు, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన గృహజ్యోతి కింద నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం, మహాలక్ష్మి కింద ఉచిత గ్యాస్‌, కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రశ్నలు అడిగారు. వీటితో పాటు కొవాగ్జిన్‌ టీకాను ఉత్పత్తి చేసిన సంస్థ, కేంద్ర ప్రభుత్వ చట్టాలు, జీ-20, ఎన్నికల సంఘం కమిషనర్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యంతర బడ్జెట్లపై ప్రశ్నలడిగారు. కానీ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ కల్చర్, కవులు, రచయితల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో రేవంత్ సర్కార్ తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారులను అవమానపరిచిందంటూ పలువురు వాపోతున్నారు.

50% దాటితే గ్రూప్‌-1 మెయిన్స్ కు..
అయితే గతంలో రద్దైన రెండు ప్రశ్నపత్రాల కంటే ఈ పేపరు ప్రశ్నల సరళి కాస్త సులభంగా ఉన్నట్లు అభ్యర్థులు, నిపుణులు చెబుతున్నారు. ఓపెన్‌ కటాఫ్‌ మార్కులు 75 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక మొత్తం 150 ప్రశ్నల్లో 25 ప్రశ్నలు అర్థమెటిక్, లాజికల్, రీజనింగ్, క్వాంటిటేటివ్‌పై అడిగారు. మిగతా 125 ప్రశ్నలు జనరల్‌ అవేర్‌నెస్‌కు సంబంధించిన నాణ్యమైన ప్రశ్నలు వచ్చాయని సీఎస్‌బీ ఐఏఎస్‌ అకాడమీ డైరెక్టర్ బాల లత తెలిపారు. పాలిటీలో ప్రశ్నలు తేలికగా అనిపించినప్పటికీ లాజికల్ గా ఉన్నాయని, అనాలసిస్‌ కన్నా ఫ్యాక్చువల్‌ ప్రశ్నలు ఎక్కువ వచ్చాయని చెప్పారు. పరీక్షలో ఓపెన్‌ కటాఫ్‌ 70-75 వరకు ఉండే అవకాశముండగా.. రిజర్వుడు వర్గాలకు 65-75 మధ్య ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద 150 మార్కుల్లో కనీసం 50% దాటిన అభ్యర్థులు గ్రూప్‌-1 మెయిన్స్ కు ప్రిపేర్ కావొచ్చని తెలిపారు.

ఏ కేటగిరిలో ఎన్ని ప్రశ్నలు..
వర్తమాన వ్యవహారాలు 13, అంతర్జాతీయ సంబంధాలు, సదస్సులు 06, లాజికల్ రీజనింగ్ 25, జనరల్ సైన్స్ 19, పర్యావరణ సమస్యలు 08, జాతీయ ఆర్థిక, సామాజిక అభివృద్ధి 07, ప్రపంచ, దేశ, తెలంగాణ జాగ్రఫీ 14, భారతదేశ చరిత్ర, సంస్కృతి 11, భారత రాజ్యాంగం, రాజకీయాలు 09, జాతీయ పరిపాలన, ప్రభుత్వ విధానాలు 08, తెలంగాణ ప్రభుత్వ విధానాలు 06, సామాజిక హక్కులు, సమస్యలు 11, తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కలలు, సాహిత్యం 13 ప్రశ్నలు అడిగారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు