TG Job Mela : నిరుద్యోగులకు సువర్ణావకాశం.. జూన్ 24న ప్రభుత్వ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా! తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. యువజన సర్వీసుల శాఖ, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్ 24న హుస్నాబాద్ వేదికగా 5వేల ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాలకోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 17 Jun 2024 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి Husnabad : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు (Un-Employees) సువర్ణ అవకాశం కల్పించనుంది. యువజన సర్వీసుల శాఖ, తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఆధ్వర్యంలో జూన్ 24న హుస్నాబాద్ వేదికగా జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. 60కి పైగా కంపెనీల్లో 5 వేల ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. తిరుమల గార్డెన్స్ అండ్ ఫంక్షన్ హాల్ (Tirumala Gardens & Function Hall) లో జరిగే ఈ జాబ్ మేళాలో 18-35 ఏళ్ల వయసు గల నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించింది. విద్యార్హతలు: 7వ తరగతి నుంచి 12వ అండర్ గ్రాడ్యూయేట్, డిప్లొమా హోల్డర్, బిఫార్మా, ఎంఫార్మా, హోటల్ మేనేజింగ్, డ్రైవర్స్, బీఇ, బిటెక్, ఎంటెక్, బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంబీఏ, ఎంసీఎ, ఎంపిఎస్, పోస్ట్ గ్రాడ్యూయేట్ అర్హత గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులుగా పేర్కొంది. HR హెల్ప్ లైన్ కోసం నంబర్లు: 888 6111 981 అభ్యర్థుల కోసం హెల్ప్ లైన్ నంబర్లు: 9642333667, 6300670339 Also Read : ఖైరతాబాద్ వినాయకుడు రెడీ అవుతున్నాడు.. ఈసారి ఎత్తులో మరో రికార్డ్! #husnabad #telangana-jobs #un-employees #tg-job-mela మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి