TS TET: మెగా డీఎస్సీకి ముందు టెట్ నోటిఫికేషన్? అభ్యర్థుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ!

తెలంగాణలో మెగా డీఎస్సీకి ముందు టెట్ నోటిఫికేషన్ పై ఉత్కంఠ నెలకొంది. బీఈడీ, డీఎడ్ పూర్తిచేసిన అభ్యర్థులు టెట్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తమకు డీఎస్సీ రాసే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం త్వరలోనే కీలక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది.

New Update
TS Exams: ఎన్నికల ఎఫెక్ట్.. ఆ పరీక్ష వాయిదా!

TS TET Exam 2024: తెలంగాణలో మెగా డీఎస్సీకి (TS DSC) కాంగ్రెస్ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా మొత్తం 11వేలకుపైగా పోస్టులకుగానూ మార్చి 4నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలుకానుంది. అయితే ఈ సందర్భంగా డీఎస్సీ అర్హత పరీక్ష టెట్ ఇష్యూ మరోసారి చర్చనీయాంశమైంది. జూన్ చివరి వారంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తుండగా.. డీఎస్సీ నోటిఫికేషన్ తో సంబంధం లేకుండా టెట్ ప్రకటన ఇస్తారా? లేక అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని మెగా డీస్సీకి ముందుగానే ప్రకటన చేస్తారా? అనే విషయంపై టెట్ అభ్యర్థుల్లో ఉత్కంఠ కొనసాగుతుంది.

అందరిని దృష్టిలో పెట్టుకుని..
ఈ మేరకు బీఈడీ (B.Ed), డీఎడ్(D.Ed) పూర్తిచేసిన అభ్యర్థులంతా మెగా డీఎస్సీకి ముందు టెట్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. టెట్ నిర్వహిస్తే చాలా మంది అభ్యర్థులకు లబ్ధి చేకూరుతుందని ఆశిస్తున్నారు. మరోసారి టెట్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. టెట్ నిర్వహించటం ద్వారా తమకు కూడా డీఎస్సీ పరీక్ష రాసే అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. మరీ ఈ నేపథ్యంలో గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకోనుందనే విషయంపై ఆసక్తి నెలకొంది. అందరిని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలనే విషయంపై ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రూప్-1కు (TSPSC Group 1) సంబంధించి మరిన్ని ఉద్యోగాలు పెంచి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. ఇదే పద్ధతిలో రాబోయే డీఎస్సీకి ముందు టెట్ నిర్వహించాలని గవర్నమెంట్ ను అభ్యర్థులు రిక్వెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. కాగా దీనిపై త్వరలోనే ప్రకటన వెలువడే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: King Cobra: పాముతో భయంకరమైన సాహసం.. వీడియో చూస్తే దడుసుకుంటారు!

ఇదిలావుంటే.. రేవంత్ సర్కార్ (Telangana Govt) ఉద్యోగాల భర్తీని శరవేగంగా చేపట్టేందుకు కసరత్తులు చేస్తుండగా ఇందులో భాగంగానే ఏటా 2 సార్లు టెట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి కసరత్తును కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఎన్​సీటీఈ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని చూస్తోంది. ఇక గతేడాది సెప్టెంబర్ లో టెట్ నిర్వహించగా పేపర్‌-1కు 2.26 లక్షల మంది, పేపర్‌-2కు 1.90 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అంతకుముందు చివరిసారిగా 2022 జూన్ 12న విద్యాశాఖ టెట్ నిర్వహించింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Civil Services results: 5సార్లు ఓడినా.. వదల్లే ఆరోసారి AIR 68వ ర్యాంక్ కొట్టిన మన తెలుగోడు

మంళవారం విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో అదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు చెందిన సాయి చైతన్య ఆల్ ఇండియా 68ర్యాంక్ సాధించాడు. అతని తండ్రి కానిస్టేబుల్, తల్లి గవర్నమెంట్ టీచర్. 5సార్లు ఫెయిల్ అయినా పట్టువదలకుండా సాయి ఆరో సారి సక్సెస్ అయ్యాడు.

New Update
UPSC ranker sai

ఐఏఎస్ అధికారి అవ్వడం అంటే ఆశామాషీ కాదు. కఠోర దీక్ష, పట్టుదలతో చదవాలి. అందులోనే ఆల్ ఇండయా ర్యాంక్ కొట్టాడంటే దాని వెనుక ఎంతో కష్టం ఉండి ఉంటది. ఓసారి ఓడిపోతేనే నిరుత్సాహ పడే ప్రస్తుత యువత సాయి చైతన్య సక్సెస్ స్టోరీ తెలుసుకోవాల్సిందే. ఐదుసార్లు సివిల్స్ ఫెయిల్ అయినా.. పట్టువదలకుండా చదివి ఆరుసారి ఐఏఎస్ అయ్యాడు. మంగళవారం ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో సాయి చైతన్య ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. అదిలాబాద్ ఏజెన్సీ ఏరియా నుంచి ఆల్ ఇండియా 68వ ర్యాంక్ సాధించిన యువకుడి సక్సెస్ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం.. 

Also read: ముంబై నుంచి హీరోయిన్‌ని తీసుకొచ్చి.. అరెస్టైన ఆ IPS చేసిన పని ఇదేనా..?

సాయి చైతన్య తండ్రి కానిస్టేబుల్. తల్లి టీచర్. చదువుకున్న వారికే చదువు విలువ తెలుస్తోంది. తల్లిదండ్రుల ప్రభుత్వ ఉద్యోగులే కదా.. అని తాను కష్టపడకుండా కూర్చోలేదు సాయి చైతన్య. పేరెంట్స్ కూడా అతన్ని  ఉన్నత స్థాయిలో చూడాలని ప్రోత్సహించారు. దాన్ని సాయి చైతన్య సద్వినియోగం చేసుకున్నాడు. పడిపడి లేచే కెరటంలో పోరాడి చివరికి ఆల్ ఇండియా స్థాయిలో సత్తా చాటాడు.

Also read:BIG BREAKING: గుజరాత్‌లో కూప్పకూలిపోయిన విమానం.. భారీ పేలుడు

సాయి చైతన్య సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా 68వ ర్యాంక్ సాధించాడు. తల్లి గవర్నమెంట్ టీచర్, తండ్రి కానిస్టేబుల్ అని కాలు మీద కాలు వేసుకొని సుఖాలు అనుభవించలేదు. తనకంటూ సొంత గుర్తింపు కోసం పోరాడి అందులో గెలిచాడు. అదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని ఉట్నూర్‌ గ్రామానికి చెందినవాడు.  సివిల్స్‌లో ఆల్ ఇండియా ర్యాంక్ రావడం ర్యాంకు రావడం ఆరేళ్ల కష్టానికి దక్కిన ఫలితమని సాయి చైతన్య అంటున్నాడు. పేదల కోసం గవర్నెన్స్ లో భాగం అవుతానని చెప్పాడు కాబోయే కలెక్టర్ సాయి చైతన్య.

Also read : Official బిగ్ బ్రేకింగ్: యూపీలో అఘోరీ అరెస్ట్

(upsc-results | adilabad | civil-services | upsc-civil-services | upsc-civil-services-exam-results)

Advertisment
Advertisment
Advertisment