Telangana: పదవ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు ఎప్పుడంటే ?

తెలంగాణలో రేపు (శుక్రవారం) పదవ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి. విద్యార్థలు అధికారిక వెబ్‌సైట్‌ bse.telangana.gov.in లో ఫలితాలు చూసుకోవచ్చు.

New Update
Telangana: పదవ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు ఎప్పుడంటే ?

తెలంగాణలో రేపు (శుక్రవారం) పదవ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఎస్సెస్సీ బోర్టు అధికారులు విడుదల చేయనున్నారు. పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ bse.telangana.gov.in లో చూసుకోవ‌చ్చు. వార్షిక పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి.

Also read: రేపు వరంగల్ కు సీఎం రేవంత్

ఇక పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 93.23 శాతం బాలికలు, 89.42 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. 3,927 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత కాగా.. ఆరు పాఠశాలల్లో జీరో శాతం ఉత్తీర్ణత న‌మోదైంది. ఇక గ‌తేడాది వార్షిక పరీక్షలో 89.60 శాతం ఉత్తీర్ణత న‌మోదు కాగా.. ఈ ఏడాది 91.31 శాతానికి పెరిగింది.

Also Read: పార్టీ కార్యకర్తలతో కేసీఆర్ సమావేశం.. ఏం మాట్లాడారంటే ?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Sumanth Prabhas: ఈసారి గోదారి కుర్రాడిగా 'మేమ్ ఫేమస్' హీరో.. వైరలవుతున్న టైటిల్ పోస్టర్

'మేమ్ ఫేమస్' సుమంత్ ప్రభాస్ నెక్స్ట్ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. సుభాష్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి  'గోదారి గట్టుపైన' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో సుమంత్  గోదావరి ప్రాంతానికి చెందిన యువకుడిగా కనిపించనున్నాడు.

New Update

Sumanth Prabhas: తొలి సినిమా 'మేమ్ ఫేమస్' తో సూపర్ హిట్ కొట్టాడు యంగ్ హీరో సుమంత్ ప్రభాస్.  పల్లెటూరి యూత్ కథా నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో సుమంత్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కెరీర్ లో మంచి అవకాశాలు రావడం మొదలయ్యాయి.  అలా తన రెండవ ప్రాజెక్ట్  రెడ్ పెప్పెట్ నిర్మాణంలో చేస్తున్నాడు. అయితే తాజాగా ఈమూవీ టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్. 

 'గోదారి గట్టుపైన'

డెబ్యూ డైరెక్టర్ సుభాష్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి  'గోదారి గట్టుపైన' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సుమంత్  గోదావరి ప్రాంతానికి చెందిన యువకుడిగా కనిపించనున్నాడు. నిధి ప్రదీప్ కథానాయికగా నటిస్తుండగా, జగపతి బాబు  ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కమెడియన్ సుధాకర్, వైవా రాఘవ్, రాజ్ కుమార్ కసిరెడ్డి తదితరులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతేడాది ప్రారంభించిన ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. సాయిసంతోష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తుండగా.. నాగ వంశీ కృష్ణ సంగీతం అందిస్తున్నారు  ఈమూవీకి.  

cinema-news Godari Gattupaina

Also Read: Bigg Boss 9: కింగ్‌కు రెస్ట్.. బరిలోకి బాలయ్య- బిగ్ బాస్ 9 ఫుల్ కంటెస్టెంట్ లిస్ట్ ఇదే..

Advertisment
Advertisment
Advertisment