Telangana Elections: కొడంగల్‌లో హైటెన్షన్.. ఎమ్మెల్యే డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ ఆరోపణలు

New Update
Telangana Elections: కొడంగల్‌లో హైటెన్షన్.. ఎమ్మెల్యే డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ ఆరోపణలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు తాజాగా కొడంగల్ నియోజకవర్గంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రావులపల్లిలో నిన్న రాత్రి కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించారు. కారులో ఏమున్నాయో చూపించాలంటూ డిమాండ్ చేశారు. ఆ తర్వాత రోడ్డుపైనే బైఠాయించి నిరసనలు తెలిపారు. సమాచారం మేరకు ఘటనాస్థలంలో భారీగా పోలీసులు మోహరించారు. అనంతరం ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి రావులపల్లికి చేరుకున్నారు.

Also Read: ఎవరైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే.. యాప్ ద్వారా ఇలా ఫిర్యాదు చేయండి!

గత ఎన్నికల్లో ఓడిపోయిన కొడంగల్‌ నియోజకవర్గంలో ఓడిపోయిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి మళ్లీ అక్కడి నుంచే బరిలో నిలుస్తున్నారు. ఈసారి ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తున్నారు. అదే సమయంలో 2018 ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని దెబ్బతీసిన పట్నం నరేందర్ రెడ్డి.. ఈసారి కూడా రేవంత్‌ను ఓడించి తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ మేరకు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలతో కొడంగల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు