చిక్కోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి పై వీడని సందిగ్ధత! చిక్కోలు జిల్లాలో వైసీపీ (YCP) ని ఎంపీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ శిరోభారంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ఇప్పటి వరకూ ఆ పార్టీకి ఎంపీ (MP) అభ్యర్థి ఖరారు కాకపోవడంపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. By Bhavana 18 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం New Update షేర్ చేయండి చిక్కోలు జిల్లాలో వైసీపీ (YCP) ని ఎంపీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ శిరోభారంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ఇప్పటి వరకూ ఆ పార్టీకి ఎంపీ (MP) అభ్యర్థి ఖరారు కాకపోవడంపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎవరిని బరిలోకి దిగమన్నా ఏదో ఒక కారణాలు చూప్పి తప్పించుకునే పనిలో నేతలు ఉండడం పార్టీ అధిష్టానం ఆ ఇద్దరి నేతలపై కన్నేసింది.... ఎవరా ఇద్దరు నేతలు.. వారు ఎంపీకి పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారా... లేదా తెలుసుకుందాం. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి... టీడీపీకి సిట్టింగ్ ఎంపీ కింజరాపు రాంమోహన్ నాయుడు అభ్యర్థిగా తనదైన శైలిలో ప్రజా క్షేత్రంలో దూసుకు పోతున్నాడు. 2019 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల మార్జిన్ లో వైసీపీ కి ఎంపీ స్ధానం దక్కకుండా పోయింది. ఈ సారి ఎలాగైనా రాంమోహన్ నాయుడు ని ఓడించే అభ్యర్థి కోసం అధికార పార్టీ ఏడాది నుంచి సోదిస్తూనే ఉంది. అయినా ఇంకా ఆరు నెలలు కూడా ఎన్నికల సమరానికి సమయం లేకపోయినా, ఇప్పటికీ అభ్యర్థిని ప్రకటించేందుకు వారు చేస్తున్న ప్రయత్నం ఫలించడం లేదు. జిల్లాలో మూడు బలమైన సామాజిక వర్గాలకు చెందిన నలుగురు నేతలపై పార్టీ అధిష్టానం ఆశలు పెట్టుకుంది. అయితే ఆ మూడు బలమైన సామాజిక వర్గాల్లో కాలింగ, వెలమ, కాపు ఉన్నాయి. వైసీపీకి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన అంత స్ధాయి నాయకుడు ఎవడూ లేక పోవడంతో మిగిలిన రెండు కాలింగ, వెలమ సామాజిక వర్గానికి చెందిన నేతలను బరిలోకి దించేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. అందులో ముందులో ధర్మాన సోదరులు ఇద్దరు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, కాలింగ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత, ఎపి స్పీకర్ తమ్మినేని సీతారాం పేరు కూడా ప్రతిపాదనలో ఉన్నట్లు సమాచారం. అయితే ధర్మాన సోదరుల్లో ఒకరైన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించి ముందే జాగ్రత్త పడ్డట్టు తెలుస్తోంది. అందుకు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి ని కలిసి తనకు వయసు పైబడింది, రాజకీయాల నుంచి విశ్రమిద్దాం అనుకుంటున్నానని ఆయనతో మొరపెట్టుకున్నారట. అయితే ఆయన మాత్రం ఈ ఒక్క సారి శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేయమని ఆయన్ని ప్రాధేయ పడినట్లు ఆయనే డప్పేసుకుంటున్నాడు. ఆయన వేసిన ఈ ఎత్తుగడలో ముఖ్యమంత్రి చిత్తు అయ్యాడని ఆయన తెగ మురిసీపోతూ ఎంపీకి పోటీ చేసే గండం నుంచి బయటపడ్డానని తన ఎన్నికల ప్రచారాన్ని తన నియోజకవర్గంలో చేసుకుంటున్నారు. ఇక పోతే మిగిలేది మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. వారిద్దరిలో ఎవరు ఎంపీ అభ్యర్థిగా బరిలో దించాలని పార్టీ అధిష్టానం తెగ సతమత మౌతుందట. ఆ క్రమంలో సామాజిక వర్గానికి సీక్వేన్స్ ఫార్ములాను వైసీపీ అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసిందట. అలా అయితే సిట్టింగ్ ఎంపీ వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, అదే సామాజిక వర్గానికి చెందిన ధర్మాన కృష్ణదాస్ ను గనక బరిలో దించితే మిగిలిన రెండు పెద్ద సామాజిక వర్గాలకు చెందిన ఓట్లు రాంమోహన్ నాయుడు కే వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న విషయాన్ని ఇటీవల జిల్లాలో పికే టీం నిర్వహించిన సర్వేలో వెల్లడైనట్లు సమాచారం. అలా అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాలింగ సామాజిక వర్గానికి చెందిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఎంపీగా బరిలోకి దిగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో ఆయన పార్టీ అధిష్టానం ఆదేశాలను పాటిస్తారా, లేదా ఇవే తనకు చివరి ఎన్నికలని ముఖ్యమంత్రి వద్ద వాపోతారా అన్న విషయం వేచి చూడాల్సిందే. #ycp #tdp #mp #srikakulam #candidate మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి