Mahabubnagar: తెలంగాణలో కాంగ్రెస్‌ని గెలిపించేందుకు ప్రజలు సిద్ధం: జూపల్లి కృష్ణారావు

మహబూబ్‌నగర్‌లో జూపల్లి కృష్ణారావు ప్రెస్ మీట్ నిర్వహించారు. PRLI సందర్శించడానికి వెళ్తున్నాం.. ధర్నాకు.. రాస్తారోకోకు పోతలేమని జూపల్లి కృష్ణారావు అన్నారు. PRLI పూర్తి చేసినమని సీఎం కేసీఆర్.. మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఇది అవాస్తవం.. అది పూర్తి కాలేదు.. వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఇది బయట పడుతుందని భయపడుతుందని ఆయన అన్నారు.

New Update
Mahabubnagar: తెలంగాణలో కాంగ్రెస్‌ని గెలిపించేందుకు ప్రజలు సిద్ధం: జూపల్లి కృష్ణారావు

అవినీతి బయట పడుతుందని భయం

మహబూబ్‌నగర్‌లో జూపల్లి కృష్ణారావు ప్రెస్ మీట్ నిర్వహించారు. PRLI సందర్శించడానికి వెళ్తున్నాం.. ధర్నాకు.. రాస్తారోకోకు పోతలేమని జూపల్లి కృష్ణారావు అన్నారు. PRLI పూర్తి చేసినమని సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఇది అవాస్తవం.. అది పూర్తి కాలేదు.. వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఇది బయట పడుతుందని భయపడుతుందని ఆయన అన్నారు. ఇప్పటికీ ఖర్చు చేసింది కేవలం 26 వేల కోట్ల రూపాయలే అన్నారు. 16న అందరూ రండి అని.. ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీటిని పొలాలకు వదులుతున్నమని చెప్పడం బోగస్ అని మండిపడ్డారు. 12 లక్షల ఎకరాలకు నిరందాలంటే 60-70 వేల కోట్ల ఖర్చు అవుతుంది. మరి మీరు ఇంకా టెండర్లు పిలవలేదని ప్రశ్నించారు. కాల్వలకు భూ సేకరణ జరగలేదు. పనులకు ప్లాన్ లేదు నీళ్ళు ఎట్లా వస్తాయని అన్నారు. ఇంకా KLI లోనే లక్షా నలభై నాలుగు వేల ఎకరాలకు సాగు నీరు రావాల్సి ఉందని మీ లెక్కలే చెబుతున్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు 90 TMCల నీటికి కేంద్రం నుంచి అనుమతులు తేలేదన్నారు.

శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా

మరి ఇది ప్రజలను మభ్య పెట్టేందుకు మాత్రమే అన్నారు. వట్టెం నుంచి లక్ష ఎకరాలకు సాగు నీటికోసం ఇపుడు టెండర్లు పిలిచారని అన్నారు. ఆంధ్రా ప్రాంత కాంట్రాక్టర్ల లబ్ధి కోసం.. ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారని జూపల్లి మండిపడ్డారు. మీరు పంపుల కోసం 2,400 కోట్లు ప్రైవేట్‌ కాంట్రాక్టర్లకు ఇస్తే.. BHEL ఇదే పంపులను కేవలం 800 కోట్లకు ఇస్తున్నారు. అంటే కేవలం పంపులు మోటార్ల వల్లనే 1600 కోట్ల అవినీతి జరిగింది. ఇది నిరుపిస్తా అని జూపల్లి కృష్ణారావు అన్నారు. లేదంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాల్‌ చేశారు. నేను ఆరు సార్లు పోటీ చేసినా.. ఏనాడూ.. కానీ పనులకు హామీ ఇవ్వలేదు.. కేవలం నీతివంతైన పాలన ఇస్తానని చెప్పిన..ఇపుడు మమల్ని అడ్డుకున్నారు. మరి ప్రాజెక్టు పూర్తయ్యిందని చెప్పారు. Googleను అడ్డుకుంటారా..? Google mapsలో కనిపిస్తుంది మీ పనితనం అన్నారు.

కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ఖాయం

ఇదంతా కేవలం CWC మీటింగ్.. కాంగ్రెస్ బహిరంగ సభ ప్రాముఖ్యతను తగ్గించే కుట్ర అన్నారు. మేము ఐదు గ్యారెంటీలు ఇస్తున్నామని అన్నారు. ఏదో ఒకటి చేసి ప్రజలను మభ్య పెట్టేందుకు మాత్రమే యత్నిచడం సరైంది కాదున్నారు. కానీ అన్నీ వేళలా మీ పాచికలు పనికి రావు. మీరు నిజాయితీని.. ప్రజలను.. నమ్మడం లేదన్నారు. అవినీతితో సమదించిన డబ్బును నమ్ముకున్నారు. కానీ మీరూ ఎంతమందిని కొన్నా.. ప్రజలు గమనిస్తున్నారు. ఈ సారి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు సిద్ధపడ్డారని జూపల్లి కృష్ణారావు అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు