Chandrababu Breakfast: జైలులో చంద్రబాబు బ్రేక్‌ఫాస్ట్‌‌ ఇదే..!

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు వయస్సు, ఆరోగ్య రిత్యా ఇంటి నుంచి ఆహారం పంపించేలా ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో సోమవారం (సెప్టెంబర్ 11) ఉదయం ఇంటి నుంచి కుటుంబ సభ్యులు బ్రేక్‌ఫాస్ట్‌ను పంపించారు.

New Update
Chandrababu Breakfast: జైలులో చంద్రబాబు బ్రేక్‌ఫాస్ట్‌‌ ఇదే..!

Chandrababu Breakfast in Central jail:

ఆరోగ్య రిత్యా ఇంటి నుంచి ఆహారం

రాజమండ్రి సెంట్రల్ జైలు (Rajahmundry Central Jail)లో ఉన్న చంద్రబాబు (Chandrababu )వయస్సు, ఆరోగ్య రిత్యా ఇంటి నుంచి ఆహారం పంపించేలా ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో సోమవారం (సెప్టెంబర్ 11) ఉదయం ఇంటి నుంచి కుటుంబ సభ్యులు బ్రేక్‌ఫాస్ట్‌ (Breakfast)ను పంపించారు.

స్నేహ బ్లాక్‌లో చంద్రబాబు

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిన్న ( ఆదివారం సెప్టెంబర్ 10) రాత్రి సమయంలో ఏసీబీ కోర్టు ఈనెల 22వ తేదీ వరకు చంద్రబాబుకు రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. నిన్న అర్థరాత్రి 1 గంట తర్వాత జైల్లోకి చంద్రబాబుని తీసుకెళ్లారు పోలీసులు. ఈ నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court Vijayawada) నుంచి భారీ పోలీసు బందోబస్తు నడుమ చంద్రబాబును పోలీసులు తరలించారు. కోర్టు ఆదేశాలతో జైల్లోని స్నేహ బ్లాక్‌లో చంద్రబాబుకు ప్రత్యేక గదిని ఇచ్చి ఖైదీ నెంబర్ 7691 కేటాయించారు అధికారులు.

also read: ఖైదీ నెంబర్ 7691…రాజమండ్రి జైలుకు టీడీపీ అధినేత..!!

చంద్రబాబును కలవనున్న కుటుంబ సభ్యులు

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేశారు. స్నేహ బ్లాక్ ఎదురుగానే జైలు ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేశారు డాక్టర్లు. మరోవైపు.. చంద్రబాబును కలిసిందేకు నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari), లోకేశ్ (Lokesh), బ్రాహ్మణి (Brahmani) తో ములాకత్‌కు అనుమతించారు. దీంతో ఇవాళ చంద్రబాబు కుటుంబ సభ్యులను కలవనున్నారు.

ఫ్రూట్ సలాడ్‌..వేడినీళ్లు, బ్లాక్ కాఫీ

చంద్రబాబు వయస్సు, ఆరోగ్య రిత్యా ఇంటి నుంచి ఆహారం పంపించేలా కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే చంద్రబాబుకు సోమవారం ఉదయం ఇంటి నుంచి అల్పాహారాన్ని పంపించారు కుటుంబ సభ్యులు. దీంతో ఇంటి నుంచి వచ్చిన అల్పాహారాన్ని జైలు సిబ్బంది (Prison staff) చంద్రబాబుకు అందించారు. అల్పాహారంలో ఫ్రూట్ సలాడ్‌ (Fruit Salad)తో పాటు తాగేందుకు వేడినీళ్లు, బ్లాక్ కాఫీని చంద్రబాబుకు పంపించారు కుటుంబ సభ్యులు.

also read: ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్.. టీడీపీ నేతలు హౌస్‌ అరెస్ట్

Advertisment
Advertisment
తాజా కథనాలు