Telangana: బండి వర్సెస్ ఈటల.. ఆ మూడు సీట్ల కోసం ఫైట్!

తెలంగాణ బీజేపీలో టికెట్ల పంచాయితీ నడుస్తోంది. సంగారెడ్డి, వేములవాడ, హుస్నాబాద్ సీట్ల కోసం బండి సంజయ్ కుమార్, ఈటల రాజేందర్ పట్టుబడుతున్నారట. అస్సలు వెనక్కి తగ్గడం లేదట.

New Update
Telangana: బండి వర్సెస్ ఈటల.. ఆ మూడు సీట్ల కోసం ఫైట్!

Telangana BJP Candidates: తెలంగాణ బీజేపీలో టికెట్ల రగడ రాజుకుంది. ఇప్పటికే మూడు దఫాలుగా తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. ఇప్పటికీ 31 స్థానాలను పెండింగ్‌ పెట్టింది. అయితే, ఇందులో మూడు సీట్ల విషయంలో తెలంగాణ(Telangana) బీజేపీలోని కీలక నేతల మధ్య వివాదం రాజుకుందట. ఆ నేతలు బండి సంజయ్(Bandi Sanjay Kumar), ఈటల రాజేందర్ (Etela Rajender). ఈ ఇద్దరు నేతలు మూడు సీట్ల విషయంలో పట్టు వీడటం లేదని బీజేపీలో టాక్ వినిపిస్తోంది. తమ తమ అనుచరులకు హుస్నాబాద్, వేములవాడ, సంగారెడ్డి సీట్లు ఇవ్వాల్సిందేనంటూ నేతలిద్దరూ అధిష్టానానికి తేల్చి చెబుతున్నారట.

వేములవాడ టికెట్‌ను తుల ఉమకు ఇవ్వాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేస్తుంటే.. వికాస్‌రావుకు కేటాయించాలని బండి సంజయ్ పట్టుబడుతున్నారట. అలాగే సంగారెడ్డి సీటు రాజేశ్వర్ రావు దేశపాండేకు ఇవ్వాలని కోరుతున్నారు బండి సంజయ్. ఈటల మాత్రం ఆ సీటును పులిమామిడి రాజుకు ఇప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారట. టికెట్ ఇస్తామన్న హామీతోనే పులిమామిడి రాజు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరినట్లు చెబుతున్నారు. ఇక హుస్నాబాద్ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి బండి సంజయ్ మద్దతిస్తుండగా.. జన్నపురెడ్డి సురేందర్ రెడ్డికి ఈటల సపోర్ట్ ఇస్తున్నారు.

ఈ విషయంలో ఎవరూ పట్టు వీడటం లేదట. ఈ మూడు సీట్ల కారణంగానే.. మిగతా సీట్ల ఎంపిక కూడా ఆలస్యం అవుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరిద్దరి మధ్య సయోధ్య కుదిరితే.. థర్డ్ లిస్ట్‌లోనే మిగతా అభ్యర్థుల పేర్లు కూడా ఖరారు చేసేవారని అంటున్నారు పార్టీ శ్రేణులు. మరి ఈ మూడు సీట్ల విషయంలో ఎవరు పట్టు నెగ్గించుకుంటారు? ఎవరు వెనక్కి తగ్గుతారు.. అనేది తెలియాలంటే ఫైనల్ లిస్ట్ వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే.

థర్డ్ లిస్ట్ ప్రకటించిన బీజేపీ..

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి 35 మంది అభ్యర్థులతో బీజేపీ మూడో లిస్ట్ ను విడుదల చేసింది. ఆ లిస్ట్ ప్రకారం అభ్యర్థుల వివరాలివే..

👉 మంచిర్యాల-రఘునాథ్‌
👉 ఆసిఫాబాద్‌-ఆత్మారామ్‌ నాయక్‌
👉 బోధన్‌-మోహన్‌రెడ్డి
👉 బాన్సువాడ-యెండల లక్ష్మీనారాయణ
👉 నిజామాబాద్‌ రూరల్‌-దినేష్‌
👉 మంథని-సునీల్‌ రెడ్డి
👉 మెదక్‌-విజయ్‌కుమార్‌
👉 నారాయణఖేడ్‌-సంగప్ప
👉 ఆందోల్‌-బాబుమోహన్‌
👉 జహీరాబాద్‌-రాజనర్సింహ
👉 ఉప్పల్‌-ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌
👉 ఎల్బీనగర్‌-సామ రంగారెడ్డి
👉 రాజేంద్రనగర్‌-శ్రీనివాస్‌రెడ్డి
👉 చేవెళ్ల-కేఎస్ రత్నం
👉 పరిగి-మారుతీ కిరణ్‌,
👉 ముషీరాబాద్‌-పూసరాజు
👉 మలక్‌పేట్‌-సురేందర్‌రెడ్డి,
👉 అంబర్‌పేట్‌-కృష్ణయాదవ్
👉 జూబ్లీహిల్స్‌-దీపక్‌రెడ్డి
👉 సనత్‌నగర్‌-మర్రి శశిధర్‌రెడ్డి
👉 సికింద్రాబాద్‌-మేకల సారంగపాణి

👉 నారాయణ్ పేట్ – కె. రతంగ్ పాండు రెడ్డి
👉 జడ్చర్ల – చిత్తరంజన్ దాస్
👉 మక్తల్ – జలందర్ రెడ్డి
👉 వనపర్తి – అశ్వద్థామ రెడ్డి
👉 అచ్చంపేట్(ఎస్సీ) – దేవని సతీష్ మాదిగ
👉 షాద్ నగర్ – అందే బాబయ్య
👉 దేవరకొండ(ఎస్టీ) – కేతావత్ లాలూ నాయక్
👉 హుజూర్‌నగర్ – చల్లా శ్రీలత రెడ్డి
👉 నల్లగొండ – మదగాని శ్రీనివాస్ గౌడ్
👉 ఆలేరు – పడాల శ్రీనివాస్
👉 పరకాల – పి. కాళీ ప్రసాద్ రావు
👉 పినపాక (ఎస్టీ) – పొదియం బాలరాజు
👉 పాలేరు – నున్న రవికుమార్
👉 సత్తుపల్లి(ఎస్సీ) – రామలింగేశ్వర్ రావు

Also Read:

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తోడల్లుడి ఇంటిపై ఐటీ దాడులు.. 12 గంటలుగా సాగుతున్న సోదాలు

సీపీఎం సంచలన నిర్ణయం.. 17 స్థానాల్లో పోటీ..

Advertisment
Advertisment
తాజా కథనాలు