/rtv/media/media_files/2025/01/22/5zBuUIT3kgmttNWS0Zrd.jpg)
Youth Congress Fight in Gandhi Bhavan
Youth Congress: హైదరాబాద్ గాంధీ భవన్‌లో బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాంధీ భవన్ వేదికగా జరిగిన యూత్ కాంగ్రెస్ సమావేశం రసాభాసగా మారింది. యూత్ కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇరు పక్షాల నేతలు బాహాబాహీకి దిగారు. యూత్ కాంగ్రెస్‌లో పదవుల కోసమే ఇరు వర్గాల నేతలు కొట్టుకున్నట్లు సమాచారం. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారని కొత్తగూడెం యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఘర్షణకు దిగిన ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు.
ఇది కూడా చదవండి: సినీ దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్.. విస్తృతంగా తనిఖీలు!
బుధవారం గాంధీభవన్‌లో యూత్ కాంగ్రెస్ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పదవుల విషయంలో కొత్తగూడెంకు చెందిన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయగా అది రెండు వర్గాల మధ్య వాగ్వాదానికి దారితీసింది. అది కాస్తా మరింత ముదిరి వివాదంగా మారింది. ఈ క్రమంలో రెండు పక్షాలు తీవ్ర ఆగ్రహానికి గురికావడంతో వారు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. రెండు వర్గాలు చీలిన నేతలు బాహాబాహీకి దిగారు. ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా బీఆర్‌ఎస్ నుంచి వచ్చి యూత్ కాంగ్రెస్‌లో చేరిన వారికి పదవులు ఇవ్వడంతో పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్న నాయకులకు మింగుడుపడలేదు. దీంతో కొత్తగూడెం యువజన కాంగ్రెస్ నేతలకు చిర్రెత్తుకొచ్చింది. తమకు దక్కాల్సిన పదవులను నిన్నకాక మొన్న పార్టీలో చేరినవారికి ఇస్తారా అంటూ పార్టీ పెద్దలను నిలదీశారు. అయినా వివాదం సద్దుమణగకపోవడంతో బుధవారం గాంధీభవన్‌లో ఇరువర్గాలు సమావేశమై పెద్దలతో చర్చించాలని నిర్ణయించారు. అనుకున్న ప్రకారం బుధవారం గాంధీభవన్‌లో సమావేశమయ్యారు.
ఇది కూడా చదవండి: చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో అలిపిరి దాడి సూత్రధారి మృతి
గాంధీభవన్‌లో హైటెన్షన్..
ఈ క్రమంలోనే రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నినాదాలు చేసుకున్నారు. ఇరు పక్షాల యూత్ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. దీంతో గాంధీభవన్‌లో హైటెన్షన్ నెలకొంది. కాగా గాంధీభవన్‌లో గొడవ గురించి తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవలసిన నేతలు తరుచూ వివాదాల సృష్టించడాన్ని సీనియర్ నేతలు తప్పుపట్టారు. ఇటీవల బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నాయకులు దాడి చేసిన ఘటన పై కూడా వారు ఆగ్రహాం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: యూపీఎస్సీ సివిల్స్ 2025 నోటిఫికేషన్ రిలీజ్.. అప్లికేషన్, అర్హత వివరాలివే!
ఇది కూడా చదవండి: Stock Market Today: లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..రికార్డ్ స్థాయిలో బంగారం ధర