KTR అరెస్టు ఆరోపణలపై హరీశ్‌ రావు మౌనం.. పార్టీ మారుబోతున్నారా ?

కేటీఆర్‌ కనుక అరెస్ట్‌ అయి జైలుకు పోతే హరీష్‌రావు బీజేపీలోకి పోతారా? అందుకే కొడంగల్‌ ఘటన తర్వాత ఆయన సైలెంట్‌ అయ్యారా? అనే అంశం చర్చనీయమవుతోంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
harish raooo

నిన్న మొన్నటివరకు బీఆర్‌ఎస్‌లో ఒకరిని మించి ఒకరు అధికార పార్టీపై విరుచుకుపడి ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టిన బావబామ్మర్థుల మధ్య విభేదాలు వచ్చాయా? అందరూ అంటున్నట్లే కేటీఆర్‌ కనుక అరెస్ట్‌ అయి జైలుకు పోతే హరీష్‌రావు బీజేపీలోకి పోతారా? అందుకే కొడంగల్‌ ఘటన తర్వాత హరీష్‌రావు సైలెంట్‌గా ఉంటున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎన్నికల తర్వాత పూర్తిగా మౌనం పాటిస్తుండగా పార్టీ కార్యకలపాలతో పాటు అటు అసెంబ్లీలోనూ బావబామ్మర్థులే అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కొన్నారు. పార్టీ నేతలు పెద్దగా స్పందించకపోయినప్పటికీ ఒకవైపు కేటీఆర్‌, మరోవైపు హరీష్‌రావులు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రుల ఆరోపణలకు గట్టిగానే సమాధానం ఇస్తూ వస్తున్నారు.

Also Read: మణిపుర్‌లో మళ్లీ హింస.. ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లపై దాడులు

KTR Arrest

గత ప్రభుత్వం హయాంలో జరిగిన అన్ని రకాల పనులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం విచారణ చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌, ఫోన్‌ట్యాఫింగ్‌, ఈ ఫార్ములా రేస్‌, ధరణి ఇలా అన్ని పథకాల్లోనూ అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో అన్ని పనులపై విచారణకు కూడా ఆదేశించింది. ఈ క్రమంలో కాళేశ్వరం విషయంలో హరీష్‌రావు, ఈ ఫార్ములా విషయంలో కేటీఆర్‌ జైలుకు వెళ్లడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగానే ఫార్మాసిటీకి వ్యతిరేకంగా సాగిన ఆందోళనలో ప్రభుత్వ అధికారులపై దాడి చేయడం రాష్ర్ట వ్యాప్తంగా సంచలనమైంది.

Also Read: వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఖతం.. మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిని అరెస్ట్‌ కూడా చేశారు. ఇదే విషయమై కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చి అరెస్ట్‌ చేస్తారని రెండు రోజులుగా ప్రచారం సాగుతోంది. ప్రభుత్వం కూడా దూకుడుగానే ఉంది. అయితే ఘటన జరిగిన రోజు స్పందించిన హరీష్‌రావు ఆ తర్వాత ఒక్కసారిగా సైలెంట్‌ అయ్యారు. ఒకవైపు కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు హరీష్‌రావు పార్టీ మారుతాడని ప్రచారం చేస్తున్నప్పటికీ ఆయన స్పందించలేదు. అలాగే కొడంగల్‌ విషయంలోనూ మళ్లీ స్పందించలేదు. దీంతో హరీష్‌రావు కాళేశ్వరం విషయంలో అరెస్ట్‌ తప్పదన్న ఉద్ధేశంతో సైలెంట్‌ అయ్యారా? లేక అందరూ అనుకుంటున్నట్లు ఆయన బీజేపీలో చేరడానికి ఫిక్స్‌ అయ్యారా అని సర్వత్రా చర్చ సాగుతోంది.

Also Read :  బై నాన్న అంటూ.. నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్

Also Read :  ఇజ్రాయెల్ ప్రధాని ఇంటిపై బాంబుల దాడి.. ఇరాన్ పన్నాగమేనా?

Advertisment
Advertisment
తాజా కథనాలు