Bandi Sanjay : రాహుల్ గాంధీది ఏ కులం..కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

ప్రధాని మోడీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాహుల్‌ది ఏ కులం..? ఏ మతం.? ఏ దేశం.?దీనిపై 10 జనపథ్‌లో చర్చ జరగాలన్నారు. సోనియా క్రిస్టియన్,ఇటలీ దేశస్తురాలు అయితే ఆమె కొడుకు ఏ దేశస్థుడవుతాడు..?అని ప్రశ్నించారు.

New Update
bandisanjay vs revanthreddy

bandisanjay vs revanthreddy

bandisanjay vs revanthreddy : ప్రధాని మోడీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కులంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. నరేంద్ర మోదీ పుట్టుకతో బీసీ కాదని, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని రేవంత్ రెడ్డి అన్నారు. పుట్టుకతో ఉన్నత కులం అయినటప్పటికీ, 2001లో ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కులాన్ని బీసీ కులాల్లో కలుపుకొన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి ఓ సభలో వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్‎పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సోషల్ మీడియా ప్లాట్‎ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయ్యారు. 42శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మరో డైవర్షన్ పాలిటిక్స్‎కు తెరలేపిందని.. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ ప్రధానమంత్రి కులంపై చర్చ మొదలు పెట్టారని ఫైర్ అయ్యారు. 

ఇది కూడా చదవండి: Pakistanis Deported: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. 12 దేశాల నుంచి బహిష్కరణ!

ప్రధానిపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ ఖండించారు. పుట్టగానే మనిషికి కులం పేరు పెడతామా? అని బండి సంజయ్.. ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. సంచలనం కొరకే ప్రధానిపై రేవంత్ వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. బాధ్యతాయుత పదవిలో ఉండి రేవంత్ ఇలాంటి మాటలు మాట్లాడటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. మోడీ కులాన్ని బీసీలో చేర్చింది కాంగ్రెస్సే అని బండి సంజయ్ అన్నారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నారు కనుక ఈ విషయం ఆయనకు తెలియదు అనుకుంటా అని సెటైర్లు వేశారు.

ఇది కూడా చదవండి: Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ లో కీలక మార్పులు.. మున్షీ ఔట్.. కొత్త ఇన్‌ఛార్జ్ ఎవరంటే?

ప్రధాని మోడీపై సీఎం చేసిన  పరిశోధన పూర్తిగా విఫలమైందని.. ఎందుకంటే 1994లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ప్రధానమంత్రి మోడీ కులాన్ని ఓబీసీగా జాబితాలో చేర్చారని.. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోయారని ఎద్దేవా చేశారు. మోడీ కులంపై మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏ కులానికి చెందినవారు..? అతని మతం ఏమిటి..? చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీతో పాటు ఆయన కులం మతం సీఎంకి కూడా తెలువదా అని అన్నారు. రాహుల్ గాంధీ తాత ఫిరోజ్ జహంగీర్ గాంధీ.  

ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi Arrest Case: నా భర్తను జైల్లో చంపేస్తారు.. వల్లభనేని వంశీ భార్య సంచలన ఆరోపణలు!

రాహుల్‌ది ఏ కులం..? ఏ మతం..? ఏ దేశం..? దీనిపై 10 జనపథ్‌లో చర్చ జరగాలి అని బండి సంజయ్ అన్నారు. సోనియా క్రిస్టియన్, ఇటలీ దేశస్తురాలు అయినప్పుడు.. ఆమె కొడుకు ఏ దేశస్థుడు అవుతాడు..? రాహుల్ గాంధీది ఏ కులమని మీరు ప్రోత్సహిస్తున్నారు..? రాహుల్‌కి కులం, మతం, దేశం, జాతి లేదు. రేవంత్ దీనికేం ఏం సమాధానం ఇస్తారు..? అని బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు. మోదీని బీసీగా దేశమంతా గుర్తించిందని బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను డైవర్ట్ చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఇటువంటి స్టేట్ మెంట్లు ఇస్తున్నారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: Bujji Thalli Song: 100 మిలియన్ వ్యూస్.. యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న 'బుజ్జితల్లి' సాంగ్

హిందూ సంప్రదాయంలో కులం తండ్రి ద్వారా వస్తుందన్నారు. ఇప్పుడు ఎవరు చట్టపరంగా మతం మార్చుకున్నారో అనే చర్చ చేయాలని అనుకుంటే.. సీఎం రేవంత్ రెడ్డి ముందుగా 10  జనపథ్ నుంచి చర్చ పెట్టాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఎంత దృష్టి మరలించాలని ప్రయత్నించిన అది పని చేయదని.. ఇప్పటికే బీజేపీ తరుపున మా నిర్ణయం తేల్చి చెప్పామన్నారు. బీసీ జాబితాలో ముస్లింలను చేరుస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని.. అలాంటి ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు సిద్ధం గా ఉన్నామని బండి సంజయ్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi Arrest Case: నా భర్తను జైల్లో చంపేస్తారు.. వల్లభనేని వంశీ భార్య సంచలన ఆరోపణలు!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాపం.. దోమల కాయిల్‌కు పసి బాలుడు బలి

రంగారెడ్డి జిల్లాలో దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పరుపుకి దగ్గరగా కాయిల్ పెట్టారు. దీనికి కాయిల్ అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

New Update
MOSQUITO COIL

MOSQUITO COIL

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్‌లో ఓ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు కాయిల్ వెలిగించారు. అది కూడా దూరంగా పెట్టకుండా పిల్లలు పడుకున్న పరుపుకి దగ్గరగానే పెట్టారు. ఆ కాయిల్ పిల్లల పరుపుకు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ నాలుగేళ్ల బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. మరో ఐదేళ్ల బాలిక పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

అదుపు తప్పిన వ్యాన్..

ఇదిలా ఉండగా ఇటీవల హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య  కార్మికులపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

యాక్సిడెంట్ తర్వాత వ్యాన్‌ డ్రైవర్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఈ దుర్ఘటన శనివారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మీద కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్‌ చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment