/rtv/media/media_files/2025/01/13/qa5pGQkwOLDni36JJ4k2.jpg)
CM Revanth
CM Revanth Reddy : ఎక్కడైనా ఉత్పత్తిదారుడే వస్తువు ధరను నిర్ణయిస్తారు… కానీ ఒక రైతు పండించిన పంటకు మాత్రం ఆ అవకాశం లేదు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని దళారులు దోపిడీకి పాల్పడుతున్నారు.రైతుల హక్కులను కాపాడేందుకు దేశంలో కాంగ్రెస్ పార్టీ కనీస మద్దతు ధర చట్టం తెచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రోజు మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన ఆయన పలు విషయాలను వెల్లడించారు.నిత్యావసరాలను అక్రమంగా నిల్వ ఉంచడం హత్యానేరం కంటే ఎక్కువ అన్న ఆయన ప్రజల ఆకలిని సొమ్ము చేసుకునే వాళ్ళను నియంత్రించడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ పకడ్బందీ చట్టం తీసుకొచ్చిందన్నారు.రూపాయి కిలో బియ్యం పథకం విజయభాస్కర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. కాకపోతే అది అంతగా ప్రజల్లోకి వెళ్లలేదన్నారు.
ఆ తరువాత ఎన్టీరామారావు ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లారన్నారు, అది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లిందన్నారు. రేషన్ బియ్యం పంపిణీపై ప్రజల్లో మంచి స్పందన వచ్చిందన్నారు. నలభై ఏళ్లుగా ఇదే పథకం కొనసాగుతోంది.. ఆనాటి నుంచి దొడ్డు బియ్యమే ఇస్తూ వచ్చారు. దొడ్డు బియ్యం తినేవారు లేక ఆ బియ్యాన్ని సన్ననియ్యంగా మార్చే మాఫియా పెరిగిపోయిందన్నారు.దొడ్డు బియ్యం ఇవ్వడం ప్రభుత్వానికి ఖర్చు తప్ప… పేదలకు ఉపయోగపడటం లేదని గ్రహించాం. అందుకే పేదలకు తినగలిగే సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించి సన్నబియ్యం పథకం ప్రారంభించామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.ఇందుకోసం రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ అందించి సన్నవడ్లు పండించాలని ప్రోత్సహించాం.
3 కోట్ల 39 లక్షలు అంటే 86 శాతం తెలంగాణ ప్రజలు సన్నబియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.భవిష్యత్ లో ఇది 90 శాతం కూడా కావచ్చు. అడిగిన ప్రతి వారికి రేషన్ కార్డు అందించాం.రైతులకు లాభం చేకూర్చడమే కాదు.. పేదల ఆకలి తీరుస్తున్నాం. సన్నబియ్యం పంపిణీతో బ్లాక్ మార్కెట్ మాఫియా తగ్గింది. పౌరసరఫరాల మంత్రి, శాఖ సిబ్బంది నిరంతర పర్యవేక్షణతోనే ఇది సాధ్యమైంది. నేటితో సన్నబియ్యం పంపిణీకి ఏడాది పూర్తయింది. మా నెక్ట్స్ టార్గెట్ విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టిక ఆహారం అందించడం అన్నారు.అందుకే వరి ఒక్కటే కాదు… ఇతర పంటలను ప్రోత్సహిస్తున్నాం.. వాణిజ్య పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నాం పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన కల్పించాలని రేవంత్ రెడ్డి తెలిపారు.
Follow Us