GHMC ఎన్నికల్లో పోటీ చేస్తాం... BJPతో పొత్తుపై పవన్ కీలక ప్రకటన!

రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల్లో పోటీ చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.  అయితే ఈ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు ఉంటుందా?

New Update
janasena

రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల్లో పోటీ చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.  అయితే ఈ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు ఉంటుందా? లేదా జనసేన ఒంటరిగానే బరిలోకి దిగుతుందా? అనే విషయంపై ప్రస్తుతానికి ఇంకా ఎలాంటి స్పష్టత లేదని, రాబోయే రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. 

జనసేన ఒంటరిగా పోటీ

తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రాంచందర్ రావు రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తుందని పవన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఏపీలో బీజేపీ, జనసేన కూటమిగా ఉన్నప్పటికీ.. తెలంగాణలో మాత్రం తాము ఒంటరి పోరుకే సిద్ధమవుతున్నట్లు బీజేపీ చీఫ్ సంకేతాలు ఇచ్చారని తెలిపారు. అలా అయితే జనసేన ఒంటరిగా పోటీ చేసే అవకాశం ఉందన్నారు.   ఇకపై తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో జనసేన మరింత చురుగ్గా ప్రజా సమస్యలపై పోరాడుతుందని పవన్ కల్యాణ్ తేల్చిచెప్పారు.

తెలంగాణలో జనసేన పార్టీ ఉనికిపై వస్తున్న విమర్శలకు పవన్ కల్యాణ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తెలంగాణలో కచ్చితంగా పోటీ చేస్తుందని ఆయన కీలక ప్రకటన చేశారు. కేవలం పోటీ చేయడమే కాదు.. పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి తెలంగాణలో స్వయంగా నేనే స్వయంగా పర్యటిస్తాను.. ప్రతి ఊరూ తిరుగుతానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇకపై తెలంగాణ రాజకీయాల్లో జనసేన చురుకైన పాత్ర పోషిస్తుందని తేల్చిచెప్పారు.

తాను ఎప్పుడూ పదవుల కోసం ఆశపడలేదన్నారు పవన్ కల్యాణ్. ఒకవేళ నాకు పదవులే కావాలనుకుంటే.. పార్టీ పెట్టిన కొత్తలోనే, అంటే 2014లోనే నాకు దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా పోటీ చేసే గొప్ప అవకాశం వచ్చిందని గుర్తుచేశారు. కానీ తాను పదవుల కోసం చూడలేదు, ఆ అవకాశాన్ని వదులుకున్నానని స్పష్టం చేశారు. అప్పట్లో జనసేన పార్టీ తరఫున తానొక్కడినే గెలవడం కంటే.. ఇరు రాష్ట్రాల భవిష్యత్తే తనకు ముఖ్యమని భావించానని చెప్పారు.

తాను స్వయంగా తెలంగాణలో ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయను. నాకు ఇక్కడ ఎలాంటి పదవులు, అధికారాలు వద్దు. కేవలం ఈ తెలంగాణ గడ్డ, ఇక్కడి ప్రజలు బాగుపడితే చాలు అనుకునే వ్యక్తినే తప్ప.. ఇక్కడ రాజకీయం చేసి లబ్ధి పొందాలనే ఆలోచన నాకు లేదని పవన్ తేల్చిచెప్పారు.

Advertisment
తాజా కథనాలు