50 ఏండ్ల తరువాత అక్కడ కాంగ్రెస్ విజయం.. శ్రేణులు కుష్!
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో 57 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగిరింది. 2023 ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి గెలుపొందారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో 57 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగిరింది. 2023 ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి గెలుపొందారు.
ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నేతలు తనను చాలా ఇబ్బందికి గురి చేశారని అన్నారు ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని ధీమా వ్యక్తం చేశారు.
హన్మకొండ జిల్లా కాజీపేటలో దారుణం చోటుచేసుకుంది. ఎక్సైజ్ సీఐ శరత్ కుమారుడు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ మహిళను ఢి కొట్టాడు. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. అయితే, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని మృతురాలి బంధువుల ఆందోళన చేపట్టారు.
పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి యశస్విని రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా జై కేసీఆర్ అంటూ నినదించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీఆర్ఎస్ శ్రేణులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఎంతటి ప్రత్యర్థులైనా కేసీఆర్‌కు జై కొట్టాల్సిందేనంటున్నారు.
ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క అర్థరాత్రి ఎన్నికల అధికారి కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. బ్యాలెట్ పేపర్‌పై మిగతా అభ్యర్థుల కంటే తన ఫోటో చిన్నగా ఉండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఫోటో మారుస్తామంటూ అధికారులు హామీ ఇచ్చారు.
రూ.40 వేల లంచం తీసుకుంటూ జనగామ మున్సిపల్ కమిషనర్ రజిత ఏసీబీకి పట్టుబడ్డారు. కలెక్టరేట్ ఎదుట జీప్లస్-3 భవన నిర్మాణం చేపట్టగా అందులోనే 10 శాతం స్థలాన్ని మున్సిపాల్టీకి మార్ట్గేజ్ చేశారు. దానిని విడిపించేందుకు కమీషన్ తీసుకున్న రజితపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
రేవంత్ రెడ్డి, ఇందిరాకి తనను విమర్శించే హక్కు లేదన్నారు స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి. తన 30ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ వివాదాల్లో తలదూర్చలేదన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో తన గెలుపు ఖాయమన్నారు.
పండగపూట ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దీపావళి నాడు ఆ ఇంటి ఇల్లాలుతో పాటు కూతుడు, అత్త దారుణంగా మరణించారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. పండగ రోజు ఒకే ఇంట్లో ముగ్గురు మరణిచటం కాజీపేట నగరంలో కలకలం రేపింది.
ములుగు ప్రజలు చాలా చైతన్య వంతులని...బీఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి. స్కాంల పార్టీ..కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.