Surekha నాకు స్ఫూర్తి.. యశస్విని రెడ్డి సంచలనం

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కొండా సురేఖ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. తమ నియోజకవర్గాల్లో కొండా దంపతుల జోక్యం ఎక్కువైందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.

New Update

Yashaswini Reddy :  ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు మంత్రి కొండా సురేఖ తీరుపై అసంతృప్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ కొండా దంపతుల జోక్యం ఎక్కువైందని.. కొండా పై హైకమాండ్‌కు ఫిర్యాదు చేయాలన్న ఆలోచనలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పటికే పార్టీ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌కు ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తోంది.

Also Read :  కర్వా చౌత్ రోజున ఉపవాసం ఎందుకో తెలుసా? ఈ పూజ చేస్తే భర్తలకు ఏమవుతుంది?

కొండా సురేఖకు మద్దతుగా యశస్విని 

ఇది ఇలా ఉంటే.. ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన  మరుసటి రోజే..   ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలలో ఒకరైన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కొండా సురేఖకు మద్దతుగా ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. కొండా సురేఖ ప్రజల కోసం నిలబడే వ్యక్తంటూ ఆమెపై  యశస్విని ప్రశంసలు కురిపించింది. తనకు కొండా సురేఖ స్ఫూర్తి అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో  కొండా సురేఖ పై వ్యక్తిరేకతతో పాటు మద్దత్తు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.  

Also Read: బ్రాను అలా ధరిస్తే క్యాన్సర్ ముప్పు.. పరిశోధనలో షాకింగ్ విషయాలు!

ఇటీవలే  కొండా సురేఖ సమంత పై చేసిన కామెంట్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపాయి. కేటీఆర్ కారణంగానే నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నారని కొండా సురేఖ ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. ఈ వాక్యాలను పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులూ సైతం ఖండిస్తూ సమంత, అక్కినేని కుటుంబానికి మద్దతుగా నిలిచారు. 

Also Read: 'అఖండ 2 - తాండవం'... మాస్ డైలాగ్ తో ఇరగదీసిన బాలయ్య.. వీడియో వైరల్

Also Read: ఈ దీపావళికి సినిమాల ధమాకా.. ఏకంగా ఆరు చిత్రాల సందడి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Yashaswini Reddy : ఎర్రబెల్లి నీకు సినిమా చూపిస్తా.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాస్ వార్నింగ్!

మాజీ మంత్రి ఎర్రబెల్లి వయస్సుతో పాటు హుందాతనాన్ని కాపాడుకోవాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ సత్తా ఏంటో లోకల్ బాడీ ఎన్నికల్లో చూపిస్తామని అన్నారు. ఇప్పుడే కాదు తెలంగాణలో మరోసారి రాబోయేది కూడా కాంగ్రెస్ సర్కారే అంటూ ధీమా వ్యక్తం చేశారు

New Update

పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి విషయంలో తనకో విజన్ ఉందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసిన అనుకున్న టైమ్ లోపు అన్ని పనులు జరుగుతాయని తేల్చి చెప్పారు.   బుధవారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఆమె మీడియాతో మాట్లాడారు.  అమ్మాయి చిన్నగా ఉంది.. సాఫ్ట్ గా ఉందని అనుకుంటే అది మీ తప్పే అని అన్నారు.  ఇంకోసారి అత్తాకోడళ్ళు అని ఇష్టమోచ్చినట్లు మాట్లాడితే మర్యాదగా ఉండదని..  మీకు అంతా ఇంట్రెస్ట్ ఉంటే అత్తా-కోడళ్ళ సినిమా, సీరియల్ తాను చూపిస్తానని హెచ్చరించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వయస్సుతో పాటు హుందాతనాన్ని కాపాడుకోవాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చెప్పారు. ఏదీ పడితే మాట్లాడితే బాగుండదన్నారు. కాంగ్రెస్ సత్తా ఏంటో లోకల్ బాడీ ఎన్నికల్లో చూపిస్తామని అన్నారు. ఇప్పుడే కాదు తెలంగాణలో మరోసారి రాబోయేది కూడా కాంగ్రెస్ సర్కారే అంటూ ధీమా వ్యక్తం చేశారు.  ఏడాది పాలనకే ఇంత ఫ్రస్టేషన్ కు లోనైతే మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం అయిపోతారో.. ఆరోగ్యాలు చూసుకోవాలంటూ మాస్ వార్ని్ంగ్ ఇచ్చారు. 

ఎర్రబెల్లి బస్తిమే సవాల్

అంతకుముందు రేవంత్ సర్కార్‌ పై మాజీ మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన కామెంట్స్ చేశారు. మంత్రి వర్గ విస్తరణ పూర్తి కాగానే ప్రభుత్వం కుప్పకూలిపోతుందని అన్నారు. మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీ సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు చీఫ్ గెస్టుగా పాల్గొని మాట్లాడారు.  స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేందుకు ప్రభుత్వం భయపడుతుందని అన్నారు.  రాసిపెట్టుకోండి.. స్థానిక సంస్థల్లో వార్ వన్ సైడ్.. ఎప్పుడు ఎన్నికలు పెట్టిన సరే..  బీఆర్ఎస్ సత్తా చాటడం ఖాయమని ఎర్రబెల్లి అన్నారు. సర్వేలన్ని కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నాయన్న  ఎర్రబెల్లి..  ఎన్నికలు పెట్టి చూడండి .. తమ సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు.  తాను చెప్పింది నిజం కాకపోతే  రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎర్రబెల్లి సవాల్ విసిరారు.  మొత్తం రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. అందులో కేవలం 10 నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఫేవర్‌గా ఉందని..  మిగతా చోట్ల బీఆర్ఎస్ పార్టీ గెలుస్తోందని జోస్యం చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం బయటపడుతోందని ఎర్రబెల్లి  స్పష్టం చేశారు.

Advertisment
Advertisment
Advertisment