/rtv/media/media_files/2025/04/07/VVEloSVuhQ9KDl78d0Iw.jpg)
Maoists surrender Photograph: (Maoists surrender)
నక్సల్ టార్గెట్‌గా కేంద్ర బలగాలు మావోయిస్టుల ఏరివేతను కొనసాగిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీగా నక్సలైట్‌లు లొంగిపోయారు. కొన్ని రోజుల క్రితమే 70 మంది మావోయిస్టులు మూకుమ్మడిగా లొంగిపోగా, తాజాగా మరో 26 మంది సరెండరయ్యారు. దంతెవాడ పోలీసుల ముందు మావోయిస్టుల లొంగుబాటు జరిగింది. లొంగిపోయిన మావోయిస్టులలో ముగ్గురిపై రూ.4 లక్షల 50వేల రివార్డు కూడా ఉంది. మావోయిస్టులు ఎవరైతే లొంగిపోయారో వారిని దంతెవాడ పోలీసులు మీడియాకు చూపించారు. పోలీసు అధికారులు లొంగిపోయిన మావోయిస్టుల వివరాలు వెల్లడించారు.
26 Maoists, including 3 with rewards totaling ₹4.5 lakh, have surrendered in Dantewada district. The surrendered Maoists were part of the organization's hierarchy, with some holding key positions#naxal #Chhattisgarh @ChhattisgarhCMO pic.twitter.com/IMx4J2U7Uu
— Manish Shukla (@manishmedia) April 7, 2025
Also read: Delhi: ఢిల్లీలో భానుడి భగభగ.. సీజన్‌లో ఆల్ టైం రికార్డు స్థాయి టెంపరేచర్
ఆపరేషన్ కగార్ పేరుతో నక్సల్స్‌ను ఏరివేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని నెలల్లో చత్తీష్‌గడ్ దండకారణ్యం ప్రాంతంలో వందల సంఖ్యలో మావోయిస్టులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైయ్యారు. దీంతో నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు.
అలాగే మావోయిస్టులు అజ్ఞాత వీడి సరెండరై సాధారణ జీవితం గడపాలని వరంగల్ పోలీస్ కమిషనర్ మావోయిస్టులకు పిలుపునిచ్చారు. గత ఫిబ్రవరి 21వ తారీఖున వరంగల్ పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోయిన నిషేధిత మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యురాలు వంజం కేశే అలియాస్ జెన్నీకి ఆమె పై ప్రభుత్వం ప్రకటించిన రూ.4 లక్షల రివార్డ్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా లొంగిపోయిన మహిళ మావోయిస్టు కు అందజేశారు.