Harish Rao : తెలంగాణపై చంద్రబాబుకు ప్రేమలేదు...హరీష్ రావు సంచలన కామెంట్స్

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మంగళవారం ఓ కార్యక్రమంలో  పాల్గొన్న చంద్రబాబు తనకు రెండు రాష్ట్రాలు రెండు కళ్లలాంటివి అని, సమన్యాయం కోరుకుంటున్నాను అనడం హాస్యాస్పదం అన్నారు.

New Update
  Harish Rao and CM Chandrababu

Harish Rao and CM Chandrababu

 Harish Rao : తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మంగళవారం ఓ కార్యక్రమంలో  పాల్గొన్న చంద్రబాబు  తనకు రెండు రాష్ట్రాలు రెండు కళ్లలాంటివి అని, సమన్యాయం కోరుకుంటున్నాను అనడం హాస్యాస్పదం అన్నారు. అదే నిజమైతే నాగార్జున సాగర్  ఎడమ కాలువ ఎండబెట్టి, కుడి కాలువ నిండుగా నీళ్ళు తీసుకువెళ్లడం సమంజసమేనా, సమన్యాయమేనా? సూటిగా అని ప్రశ్నించారు. ఖమ్మం, నల్గొండలో నీళ్ళు లేక పంటలు ఎండుతున్నాయని ఆ పాపం రేవంత్ రెడ్డి, ఆయన గురువు చంద్రబాబుది అని మండిపడ్డారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ కృష్ణా జలాల్లో  ఏపీ 512 టీఎంసీల నీరు మాత్రమే వాడుకోవాల్సింది, ఇప్పటికే 657 టీఎంసీల నీరు వాడుకున్నారని.. తెలంగాణకు 343 టీఎంసీలు రావాల్సింది, 220 టీఎంసీలు మాత్రమే వచ్చిందని అన్నారు. అయినా రేవంత్‌ రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు.

Also Read: ఇంద్రా బస్సు బోల్తా.. స్పాట్‌లో 12 మంది..

 కేంద్ర ప్రభుత్వంతో కలిసి చంద్రబాబు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని, దానివల్ల తెలంగాణలో తాగునీటికి, సాగునీటికి తీవ్ర కరువు ఏర్పడనుందని ఇది సమన్యాయం ఎలా అవుతుందని హరీష్‌రావు మండిపడ్డారు. గోదావరి బంకచర్ల ప్రాజెక్టు పై మాట్లాడుతూ.. సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటున్నామని అంటున్నారని, నిజానికి గోదావరి నీటిని పెన్నాకు తీసుకువెళ్లాడానికి ప్రయత్నిస్తున్నారని హరీష్‌రావు ఆరోపించారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణకు గోదావరి జలాల్లో 968 టీఎంసీలు రావాల్సి ఉండగా..  200 టీఎంసీల నీటిని కూడా ఎప్పుడూ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర నాయకులు ఇవ్వలేదన్నారు. అందుకే 240 టీఎంసీల నీటికోసం కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్‌ సాధించారని.. ప్రస్తుతం కాంగ్రెస్ నిర్లక్ష్యం వలన గోదావరిపై ఇంకా నిర్మించాల్సిన ప్రాజెక్టుల డీపీఆర్ లు వెనక్కి వస్తున్నాయని అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:  మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఇలా అయితే మనకు దక్కాల్సిన నీటిని పొరుగు రాష్ట్రాలు దోచుకుపోతాయని హరీష్‌ రావు హెచ్చరించారు. నిన్న చంద్రబాబు “కాళేశ్వరం మంచిది.. నేను కాళేశ్వరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేయలేదు” అని అన్నారు. అయితే, 2018 జూన్ 13న చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖలో “కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వడం పట్ల తీవ్రమైన విచారం వ్యక్తం చేస్తున్నాం” అని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు “కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోలేదని” అంటున్నారు అని హ‌రీశ్‌రావు తెలిపారు. కాళేశ్వరం అనుమతులు రద్దు చేయాలని, ఆ ప్రాజెక్టు పనులు నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరిన విషయం మీడియాకు తెలియ జేశారు. చంద్రబాబు దత్తత తీసుకున్న జిల్లాల్లో పాలమూరు ప్రాజెక్టు, దిండి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలను కూడా చంద్రబాబు వ్యతిరేకిస్తూ లేఖలు రాసిన విషయం బయటపెట్టారు. ఆయన నిజంగా రెండుకళ్ల సిద్ధాంతం, సమన్యాయం కోరుకుంటే వెంటనే తెలంగాణలోని ప్రాజెక్టులపై నో అబ్జెక్షన్ లెటర్ కేంద్రానికి రాయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Also Read :  అమెరికా ఇంక తగ్గేదే లే..యూఎస్ కాంగ్రెస్ లో ట్రంప్ మొదటి ప్రసంగం

తెలంగాణ నీటి హక్కుల రక్షణ కోసం కేసీఆర్ ప్రాజెక్టులు కడితే.. రేవంత్ అసమర్ధత, చంద్రబాబు కుట్రలతో కేంద్రంలోని బీజేపీ ఆ ప్రాజెక్టుల డీపీఆర్‌లను వెనక్కి పంపింది.  చంద్రబాబు సీఎం కాగానే తెలంగాణకు చెందిన ఒక్కో ప్రాజెక్టు డీపీఆర్‌లు కేంద్రం నుంచి వాపస్ వస్తున్నాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం, చంద్రబాబు కేంద్రంలో తన పలుకుబడి ఉపయోగించి డీపీఆర్‌లు వాపస్ వచ్చేలా చేసిండు. రేవంత్ రెడ్డికి బీజేపీని ప్రశ్నించే తెగువ లేదు, తెలివి లేదు. ఈయన చంద్రబాబును ఎదిరించి ప్రాజెక్టులు సాధిస్తారా, అక్రమ ప్రాజెక్టులను ఆపగలుగుతాడా? అని రేవంత్ రెడ్డిని హ‌రీశ్‌రావు ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: Sharmila: జగనన్నను వదలని షర్మిల.. ఆ కుట్రలో కర్త, కర్మ, క్రియ అంటూ సంచలన ఆరోపణలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

నాకు మంత్రి పదవి.. అద్దంకి సంచలన ఇంటర్వ్యూ!

కేసీఆర్ బహిరంగ సభలకే వస్తాడని.. బయటకు రాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. మంత్రి పదవి విషయంలో తనకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. అద్దంకి పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.

New Update
Advertisment
Advertisment
Advertisment