/rtv/media/media_files/2025/04/26/xyLlSqQ0sFWxQ3JWcQYk.jpg)
Child rape
Crime : కామంతో కళ్లుమూసుకుపోయిన మృగాళ్లు వయసుతో సంబంధం లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఎదుట ఉన్నది వృద్దులా? పసివారా? అనేది ఆలోచించకుండా ఆడవారైతే చాలు అన్నట్లు వ్యవహారిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ ఎనిమిదేళ్ల చిన్నారిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. భూపాలపల్లి జిల్లా రేగొండ మండల పరిధిలో ఈ అమానుష ఘటన వెలుగు చూసింది. ఎనిమిదేళ్ల పసిపాపపై ఇద్దరు మృగాళ్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రేగొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (8) ఘటన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉంది. దీనిని ఆసరాగా చేసుకున్న ఇద్దరు యువకులు, చిన్నారిని బలవంతంగా ఎత్తుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ చిన్నారిని అక్కడే వదిలేసి పారిపోయారు. కాగా అత్యాచారానికి గురైన బాలిక పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన చిన్నారిని కుటుంబ సభ్యులు..భూపాలపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చిన్నారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సమాచారం సేకరించే పనిలో పడ్డారు. స్థానికు సమాచారంతో రేగొండ పోలీసులు రంగంలోకి దిగి నిందితులపై ఫోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు అదే గ్రామానికి చెందిన వారా లేక బయటి నుంచి వచ్చారా.. అనే కోణంలో విచారణ సాగుతోందని తెలిపారు. చిన్నారిపై జరిగిన ఈ అఘాయిత్యంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పసిపాపపై ఇంతటి దారుణానికి ఒడిగట్టిన మృగాళ్లను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిందితులకు ఉరిశిక్ష పడేలా ప్రభుత్వం వేగంగా స్పందించాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కాగా పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలతో పాటు నిందితులకు సంబంధించిన ఆనవాళ్ల కోసం అన్వుషిస్తున్నారు.
Follow Us