MLC Nominations: విజయశాంతి, అద్దంకి, శంకర్ నాయక్, సత్యం, దాసోజు శ్రవణ్ నామినేషన్-PHOTOS

ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్యే అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్లు దాఖలు చేశారు. సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ తరఫున దాసోజు శ్రవణ్ నామినేషన్లు వేశారు.

New Update
TG MLA Quota MLC Nomination

TG MLA Quota MLC Nomination

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hyderabad: సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులు

హైదరాబాద్‌లోని బేగంపేటలో సురేష్ అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా పడిపోయి అపస్మారక స్థితిలో వెళ్లాడు. దీంతో అక్కడున్న ట్రాఫిక్ పోలీసులు అతడికి సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడారు. సురేష్ స్ప్రుహలోకి వచ్చిన వెంటనే ఆస్పత్రికి తరలించారు.

New Update
CPR

Hyderabad Traffic Police Performing CPR

ఎవరైనా అకస్మాత్తుగా అపస్మారక స్థితిలో పడిపోతే వాళ్లకి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా అలాంటిదే మరో ఘటన హైదరాబాద్‌లో జరిగింది. ఆదివారం అకస్మా్త్తుగా రోడ్డుపై పడిపోయిన ఓ వ్యక్తికి ట్రాఫిక్‌ పోలీసులు సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడారు. ఇక వివరాల్లోకి వెళ్తే బేగంపేట పీటీఐ జంక్షన్ వద్ద సురేష్ అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా ఒక్కసారిగా అక్కడే పడిపోయాడు. 

Also Read: మరో వివాదంలో షమీ.. కూతురు చేసిన పనిపై ముస్లిం పెద్దలు ఫైర్!

ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వడదెబ్బ కొట్టి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతడిని గమనించిన బేగంపేట ట్రాఫిక్‌ సీఐ వెంటనే అతన్ని రోడ్డుపై నుంచి పక్కకు తీసుకొచ్చారు. ట్రాఫిక్‌ పోలీసుల చేత సీపీఆర్ చేయించారు. వాళ్లు కొద్దిసేపు సీపీఆర్‌ చేయగా.. అపస్మారక స్థితి నుంచి సురేష్‌ స్పృహలోకి వచ్చాడు. 

Also Read: గ్రూప్ 1 ఫలితాలపై అనుమానాలు.. ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు

ఆ తర్వాత వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ సిబ్బంది వెంటనే స్పందించి సీపీఆర్‌ చేయడంతో సురేష్ ప్రాణాలతో బయటపడ్డాడు. అతడి మొబైల్‌ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సురేష్‌ ఆదిలాబాద్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మరోవైపు అతడికి సీపీఆర్‌ చేసిన ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్‌ పోలీసులపై ప్రజలు ప్రశంసల వర్షం కరిపిస్తున్నారు.  

Also Read: బోట్‌వాలాకు IT షాక్.. రూ.30 సరే ఇప్పుడు రూ.12.8 కోట్ల ట్యాక్స్ కట్టేదెలా..?

Advertisment
Advertisment
Advertisment