/rtv/media/media_files/2024/11/07/1cSe6xroa2s8jAftOiFV.jpg)
రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎక్కువగా యువతే ప్రాణాలు విడుస్తున్నట్లు ఇప్పటికే పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగానే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారిపై సైతం కేసులు పెట్టి శిక్షలు విధిస్తున్నారు. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా వారిలో మార్పు రావడం లేదు. అంతకంతకు మరింత ఎక్కువ చేస్తున్నారు. దీంతో విసుగెత్తిపోయిన న్యాయస్థానం అనూహ్య తీర్పును వెలువరించింది.
డ్రంక్ అండ్ డ్రైవ్ వాహన తనిఖీలు
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారికి సరైన శిక్ష విధించింది. ఇందులో భాగంగానే ఇటీవల మంచిర్యాల జిల్లా కేంద్రంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ వాహన తనిఖీలు నిర్వహించగా.. దాదాపు 27 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ట్రాఫిక్ పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఇందులో భాగంగానే ఈ కేసును పరిశీలించిన మంచిర్యాల మొదటి అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ఉపనిషద్విని ఊహించని తీర్పు ఇచ్చారు.
ఊహించని తీర్పు
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారంతా గురువారం నుంచి సుమారు వారం రోజుల పాటు స్థానిక మాతాశిశు సంరక్షణ కేంద్రంలో పారిశుద్ధ్య పనులు చేయాలని తీర్పునిచ్చారు. ఇందులో భాగంగానే వాహనదారులు నింబంధనలు పాటించాలని లేనియెడల కఠన చర్యలు తప్పవని ట్రాఫిక్ సీఐ సత్యన్నారాయణ తెలిపారు.
Also Read : నాని - శ్రీకాంత్ ఓదెల మూవీకి డిఫరెంట్ టైటిల్.. అస్సలు ఉహించలేదే
.. .
MLA Rajasingh : ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్ షాక్.. మూడు కేసులు నమోదు!
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్‌షాక్ తగిలింది. శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్ వ్యాఖ్యలపై పోలీసుల చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మంగళ్‌హాట్ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.
mla-rajasingh cases
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్‌షాక్ తగిలింది. శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్ వ్యాఖ్యలపై పోలీసుల చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మంగళ్‌హాట్ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. శోభాయాత్రలో రాజాసింగ్ మాట్లాడుతూ ఉండగా.. భక్తులు ఒక్కసారిగా టస్కర్ వాహనం వద్దకు తోసుకుంటూ వచ్చారు. దీంతో పోలీసులు వారిని పక్కకు జరుపుతూ.. భక్తులు, కార్యకర్తలపై లాఠీలు ఝులిపించారు. ఈ క్రమంలో భక్తులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీలు ఝులిపిస్తే..లాఠీలకు మేమూ పని చెప్తామంటూ రాజాసింగ్ కామెంట్స్ చేశారు. అయితే రాజాసింగ్ వ్యాఖ్యలపై పోలీసుల సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.
ఇక ఇదే శోభాయాత్రలో ఓవైసీ బ్రదర్స్‌పై రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒవైసీ బ్రదర్స్‌ను... కుక్కల బోనులో వేసి పాకిస్తాన్ పంపిస్తామని అన్నారు. ముస్లింలను ఒవైసీ సోదరులు మోసం చేస్తున్నారంటూ రాజాసింగ్ మండిపడ్డారు. ఒవైసీ బ్రదర్స్ ముస్లింల ఆస్తులను దోచుకున్నారని.. వారి అరుపులకు ఎవరు భయపడరంటూ రాజాసింగ్ కీలక కామెంట్స్ చేశారు.
ముస్లింలకు వ్యతిరేకం కాదు
వక్ఫ్ బోర్డ్ పేరుతో ఒవైసీ బ్రదర్స్ ఎన్నో భూములు కబ్జాకు గురయ్యాయని రాజాసింగ్ అన్నారు. బోర్డు రాకముందు 4 వేల ఎకరాలుంటే.. బోర్డును అడ్డం పెట్టుకుని 9లక్షల 50 ఎకరాల భూములను కబ్జా చేశారని ఆరోపించారు. ఇక వక్ఫ్ బోర్డ్ ముస్లింలకు వ్యతిరేకం కాదని.. వారి ఆస్తులకు మోడీ రక్షణ కల్పిస్తారని చెప్పారు. ప్రస్తుతం ఇది మోడీ భారత్ అని అన్నారు.
Also Read : Tamilisai Soundararajan : తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం!
Also Read: Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి
Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!
USA-China: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు
Stock Markets: చైనాపై ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..
BIG BREAKING: ఇండస్ట్రీలో విషాదం.. కమెడియన్ తల్లి కన్నుమూత
Canada: కెనడా రాజకీయాల్లో కొత్త ట్రెండ్