దానికోసం.. అత్తతో కలిసి అల్లుడు, చివరికి ఇలా దొరికారు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఉద్మీర్‌గల్లీలో క్యామొళ్ల శంకర్ (50)తో అల్లుడు రవి ఆస్తి విషయంలో గొడవ పడ్డాడు. అనంతరం అత్త చిన్నమ్మతో కలసి మామను గొంతు నులిమి హత్య చేశాడు. కూతురికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అసలు నిజం బయటపడింది. By Seetha Ram 07 Oct 2024 in తెలంగాణ క్రైం New Update షేర్ చేయండి ఈ మధ్య ఆస్తి, భూ తగాదాలు అధికమైపోయాయి. వీటి కోసం కొందరు రక్త సంబంధాలను సైతం లెక్కచేయడం లేదు. అడ్డొచ్చిన వారిని అంతమొందిస్తున్నారు. తల్లి, తండ్రి, అన్నా, తమ్ముడు అనే బేదాభిప్రాయాలు లేవు.. ఆస్తే ముఖ్యం. ఇలాంటి వివాదాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. అత్త, అల్లుడు ప్లాన్ మేకలు కాసుకుంటూ జీవిస్తున్న ఓ వ్యక్తి.. తన ఇద్దరి కూతుళ్లకు పెళ్లి చేశాడు. అందులో ఒక అల్లుడు ఇల్లరికం ఉంటున్నాడు. ఓ రోజు మామ ఆస్తిపై కన్నేసాడు అల్లుడు. దాని కోసం మామతో గొడవ పడ్డాడు. అతడు ఒప్పుకోకపోయేసరికి చంపేయాలని నిర్ణయించుకున్నాడు. చివరికి పక్కా ప్లాన్ ప్రకారం మామని హత్య చేశాడు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ ప్లాన్‌లో అతనొక్కడే కాదు.. మరో వ్యక్తి కూడా ఉన్నారు. అదెవరో ఇప్పుడు పూర్తి వివరాల్లో తెలుసుకుందాం. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఉద్మీర్‌గల్లీలో క్యామొళ్ల శంకర్ (50), చిన్నమ్మ దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. వారికి ఎలాగోలా పెళ్లిళ్లు చేశారు. అయితే అందులో పెద్ద అల్లుడు రవి తమ అత్తా, మామ ఇంట్లోనే ఇల్లరికం ఉంటున్నాడు. అయితే మామ శంకర్‌కు ఇంటితో పాటు ఖాళీ స్థలం ఉంది. అంతేకాకుండా కొన్ని జీవాలు కూడా ఉన్నాయి. వాటికోసం రవి తన మామతో గొడవ పడ్డాడు. ఇది కూడా చదవండి: అవమానంతో యువకుడు.. ఏం చేశాడంటే? ఎలాగైనా తన మామను అంతమొందించి ఆస్తిని దక్కించుకోవాలనుకున్నాడు. అయితే తన ఒక్కడి వల్ల జరిగేది కాదని.. అత్తతో ప్లాన్ వేశాడు. అత్త కూడా ఓకే చెప్పింది. దీంతో నిద్రిస్తున్న శంకర్‌ను అల్లుడు రవి, భార్య చిన్నమ్మ కలిసి గొంతు నులిమి చంపేశారు. ఆపై ఏమి ఎరుగనట్టు సహజ మరణంగా అందరినీ నమ్మించారు. ఇక ఈ విషయం తెలిసి మరో కూతురు పుట్టింటికి వచ్చింది. అయితే అతడి మెడపై గాట్లు చూడటంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగటంతో నిజా నిజాలు బయటపడ్డాయి. రవి, చిన్నమ్మలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. #murder #crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి