/rtv/media/media_files/2025/03/30/2tSMx0ssb6BywphLxXlp.jpg)
Revanth Horoscope
Revanth Horoscope : ఉగాది పర్వదినం సదర్భంగా శ్రీ విశ్వా వసు నామ ఉగాది వేడుకలు రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అధికార యంత్రాంగం మొదలైనవారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగం చదివి వినిపించారు. తెలంగాణ పంచాంగం ఎలా ఉందో చెప్పారు. తెలుగు వారి కొత్తేడాది ఉగాది పర్వదినాన్ని ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. ఉగాది అంటనే పంచాంగ శ్రవణం. ఈ పంచాంగ పఠనాలతో రాష్ట్రవ్యాప్తంగా సందడి నెలకొంది. ఈ కొత్త ఏడాది ఎవరి భవిష్యత్తు ఎలా ఉందన్నది అందరూ ఆసక్తికరంగా తెలుసుకుంటున్నారు.
ఇది కూడా చూడండి: Ugadi 2025 Tv Offers: ఉగాది స్పెషల్.. బ్రాండెడ్ 4k TVలపై బ్లాక్ బస్టర్ ఆఫర్లు- వదిలారో మళ్లీ దొరకవ్!
పండితులు బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ఈ ఏడాది తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుందని, వర్షాలు బాగా కురుస్తాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం మిథున రాశి, పునర్వసు నక్షత్రంలో ఆవిర్భవించిందని.. పాలకుల మధ్య పోటీతత్వం పెరుగుతుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పాలకులు పోటీపడి పాలన సాగిస్తారని చెప్పారు. ఈ ఏడాది ప్రజలు మెచ్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలన సాగిస్తారని అన్నారు. ప్రజలకు నచ్చే విధంగా రేవంత్ రెడ్డి పరిపాలన ఉంటుందని అన్నారు.
ఇది కూడా చూడండి: Ugadi 2025: ఉగాది రోజు ఈ రంగు బట్టలు ధరిస్తే ఏడాది అంతా మీకు తిరుగు ఉండదు
తెలంగాణా రాష్ట్రంలో వర్షాలు బాగా పడతాయని వివరించారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని, సోషల్ మీడియా భయపెడుతుందన్నారు. తెలంగాణలో రిజిస్ట్రేషన్లు పరుగులు పెడతాయి. కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం ప్రభుత్వం బాగా కృషి చేస్తుందని వివరించారు. విద్య, వైద్యానికి ప్రభుత్వం బాగా ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రెండు రాష్ట్రాల సీఎంలు పోటీపడి పరిపాలన కొనసాగిస్తారన్నారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా పరిపాలన మెరుగుగా కొనసాగిస్తుందన్నారు.ఆదివారం నాడు చుక్క ముక్క వండుకోవద్దు.. దాని ద్వారా మంచి పరిణామాలు చూస్తామని వివరించారు.
ఇది కూడా చూడండి: Priyanka Gandhi: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!
తెలంగాణలో వర్షాలకు ఏమాత్రం ఇబ్బంది లేదని.. పంటలు అద్భుతంగా పండుతాయన్నారు. ఎర్రరేగడి భూములు, ఎర్రటి ధాన్యాలు మంచి ఫలితాలు ఇస్తాయన్నారు. తుపాన్లు, భూకంపాలు అప్పుడప్పుడు పలకరించవచ్చునని అన్నారు. శాంతి భద్రతల విషయంలో నిరంతరం పోలీసులు జాగృతంగా ఉండి పనిచేస్తారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కూడా చెప్పారు. ఈ ఏడాది ఆర్థిక భారం ఎక్కువగానే ఉంటుందని.. ప్రజలకు డబ్బు బాగానే సిద్ధిస్తుందన్నారు. రాష్ట్రానికి ఆదాయం రావడంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయని.. పొరుగు రాష్ట్రాలతో నీటి విషయంలో సమస్యలు వస్తాయనన్నారు. వాటిని సీఎం పరిష్కరిస్తారని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. కానీ కొన్ని అనుకోని సమస్యల వల్ల ఆశించిన ఫలితాలు రాకపోవచ్చునని చెప్పారు. పాలకులు ప్రజాధనాన్ని ప్రజల కోసమే ఖర్చు చేస్తారని, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారని పంచాగ శ్రవణంలో వెల్లడించారు.
ఇది కూడా చూడండి: Ugadi: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?