తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య పులుల అలజడి ఎక్కువైపోయింది. అడవుల్లో ఉండాల్సిన పులులు గ్రామాల్లో సంచరించి ప్రజలపై దాడి చేస్తున్నాయి. ఇటీవల కాలంలో రాష్ట్రంలోని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ అడవుల్లో పెద్ద పులులు భీబత్సం సృష్టించాయి. సమీప గ్రామాల్లోకి వచ్చి ఎంతో మంది ప్రజలపై దాడి చేశాయి. అందులో తీవ్రంగా గాయపడినవారితో సహా మృతి చెందిన వారు కూడా ఉన్నారు. ఇది కూడా చూడండి: ఏపీని వదలని వరుణుడు..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! పులుల భయంతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడిపిన క్షణాలు ఉన్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక ప్రజలు గజగజ వణికిపోయారు. కనీసం పనులకు వెళ్లాలన్నా భయపడేవారు. ఇదంతా ఈ మధ్య జరిగిన వ్యవహారమే. ఇక పులులు జనావాసాల్లోకి రాకుండా ఉండేందుకు ఫారెస్ట్ ఆఫీసర్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవి ఆగడం లేదు. తరచూ ఎక్కడో ఒక దగ్గర పులులు కనిపిస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో మరో రెండు పులుల సంచారం ఇక ఈ మధ్య పులుల భయంతో వణికిపోయిన ప్రజలు ఇప్పుడిప్పుడే తమ భయాన్ని వదిలి పనులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో రెండు పులులు తెలంగాణలోకి వచ్చాయన్న వార్త విని భయబ్రాంతులకు గురవుతున్నారు. రాష్ట్రంలోని ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అడవుల్లో పులుల సంచారం మళ్లీ అలజడి సృష్టించింది. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు ఇది కూడా చూడండి: సౌత్‌ఇండియన్స్ వద్దంటూ జాబ్ నోటిఫికేషన్..తిట్టిపోస్తున్న నెటిజన్లు రెండు పులులు రాష్ట్రంలోకి వచ్చినట్లు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ గుర్తించింది. అవి మహారాష్ట్ర నుంచి వచ్చినట్లు తెలిపారు. బుధవారం మహారాష్ట్రలోని మకిడి రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా ఒక పెద్దపులి కనిపించింది. అది గురువారం ఉదయాన్నే సిర్పూర్ (టి) రేంజ్‌లోకి ఎంటర్ అయినట్లు గుర్తించారు. అలాగే మరోవైపు కౌటాల మండలం గుండాయిపేట్ గ్రామ సమీపంలో గురువారం మరో పెద్ద పులి అలజడి సంచలనం రేపింది. జొడే నవీన్ అనే రైతు తన మిర్చి తోటకు వెళ్తుండగా.. పులి కనిపించింది. దీంతో అతడు వెంటనే భయంతో ఇంటికి పరుగులు తీశాడు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఇది కూడా చూడండి: ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ స్లీపర్ రైలు..ఏ రూట్లో అంటే! అనంతరం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ (ఎఫ్ డీవో) వినయ్ కుమార్ సాహూ తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఆపై అవి పులి అడుగులేనని గుర్తించారు. దీంతో సమీప గ్రామస్థులు గజగజ వణికిపోతున్నారు. కాగా మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తాడోబా టైగర్ రిజర్వ్‌ల నుంచి పులులు వస్తున్నట్టు వారు గుర్తించారు. ట్రాక్టర్లపై అన్వేషణ మరోవైపు సిర్పూట్, కాగజ్ నగర్ రేంజ్‌లోని చీలపల్లి-వేంపల్లి మధ్య అటవీ ప్రాంతంలో పులి ఉన్నట్లు ఫారెస్ట్ ఆఫీసర్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ పులి కోసం ట్రాక్టర్లపై అన్వేషణ మొదలుపెట్టారు. అలాగే మంచిర్యాల ఫారెస్ట్ ముల్కల్ల బీట్‌లో ఓ ఆడపులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. ఆ పులి బుధవారం సఫారీ రోడ్ కెమెరాకు చిక్కినట్లు తెలిపారు. అందువల్ల సమీప ప్రజలు, రైతులు అడవిలోకి వెళ్లొద్దని సూచించారు. ఇది కూడా చూడండి: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఏకంగా 15 రోజుల పాటుసెలవులు ప్రజలకు సూచన పులి కనిపిస్తే ప్రజలు భయపడకుండా ఉండాలని అన్నారు. అంతేకాకుండా పులి తిరిగే ప్రాంతంలో ఒక్కొక్కరుగా కాకుండా.. గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించారు. ఉదయం 8 గంటల తర్వాతే పొలాలకు వెళ్లాలని.. సాయంత్రం 4 గంటల లోపే ఇళ్లకు తిరిగి రావాలని అన్నారు. రైతులకు, ప్రజలకు టైగర్ మాస్క్‌లు ఇస్తామన్నారు.