వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఖతం.. మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్ గౌడ బీఆర్‌ఎస్‌ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్‌ ఉండదన్నారు. పదేళ్లలో తెలంగాణ అభివద్ధి జరగలేదని.. కేవలం దోపిడే జరిగిందని విమర్శించారు.

New Update
pccc

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్ గౌడ బీఆర్‌ఎస్‌ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్‌ ఉండదన్నారు. హనుమకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. '' బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేకపోయింది. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచుకుంది. పదేళ్లలో తెలంగాణ అభివద్ధి జరగలేదు. కేవలం దోపిడే జరిగింది. గత ప్రభుత్వం కంటే మేము మెరుగైన పాలన అందిస్తున్నాం. 

బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు. రాష్ట్రంలో విపక్ష పార్టీగా వ్యవహరించడంలో బీఆర్ఎస్‌ పూర్తిగా విఫలమైంది. అధికారం కోల్పోయామనే అసహనంతో కేటీఆర్‌ మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్‌ ఉండదు. పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్‌ ఇచ్చిన ఉద్యోగాల కన్నా ఏడాది వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలే ఎక్కువ. ప్రస్తుతం దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది. 

Also Read: మహారాష్ట్ర ఎన్నికలు.. రాహుల్ గాంధీ బ్యాగ్ చెక్ చేసిన అధికారులు

మిగతా రాష్ట్రాల్లో కూడా తెలంగాణ తరహా స్కీమ్స్‌ కావాలని కోరుతున్నారు. కుల గణన వల్ల తెలంగాణ దేశానికే రోల్‌ మోడల్‌గా నిలుస్తుంది. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధిలో బీఆర్‌ఎస్‌ నేతలతో మాట్లాడేందుకు చర్చకు నేను సిద్ధం. మేము అన్ని రకాల ప్రజలను మెప్పించాం. అందుకే విజయోత్సవ సభలు కూడా నిర్వహిస్తున్నాం. వరంగల్ విజయోత్సవ సభకు 'ఇందిరా మహిళా శక్తి సభ'గా నామకరణం చేశామని పేర్కొన్నారు.  

ఇదిలాఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావడంతో తాము చేపట్టిన కార్యక్రలు, పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాని నవంబర్ 14 నుంచి డిసెంబర్‌ 9 వరకు విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రజాపాలన- ప్రజా విజయోత్సవ సభను వరంగల్‌లో నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకొంది. అదే రోజున వరంగర్ వేదిక నుంచి 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. 

Also Read: పెళ్లి పేరుతో మైనర్ బాలికను తల్లిదండ్రులు.. ఏం చేశారంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు