/rtv/media/media_files/2025/03/06/Bz70nyLMi27ptQbutFSA.jpg)
suicide attempt
suicide attempt : ప్రేమ గుడ్డిదే కాదు అప్పుడప్పుడు పిచ్చిది కూడా అవుతుంది. ఆ పిచ్చిముదిరితే కొంతమంది రాక్షసులుగా మారితే, మరికొందరు ఒంటరితనంగా ఫీలవుతుంటారు. ఆ సమయంలో కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా వెనుకాడరు. అలాంటిదే ఈ ఘటన మూడేండ్లుగా ప్రేమించిన అమ్మాయి కాదందని ప్రేమించిన యువతి ఇంటి ముందు ప్రేమికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్ లింగంపల్లికి చెందిన 21 సంవత్సరాల సోను డిగ్రీ చదువుతున్నాడు. ఇక హౌసింగ్ బోర్డ్ కాలనీ, బృందావనం కాలనీకి చెందిన అంబిక ఎల్‌ఎల్‌బీ స్టూడెంట్. ఇద్దరు గత మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు.
Also read: హోం వర్క్ చేయలేదని.. టీచర్ ఏం చేసిందంటే?
అయితే ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థాలు రావడంతో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. ప్రియురాలు ప్రియుడ్ని కాదనడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సోను ఈ రోజు ఉదయం ప్రియురాలి ఇంటికి వచ్చాడు. ప్రేయసి ఇంటి ముందు ఉన్న మొదటి అంతస్తు పై ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్ చల్ చేశాడు. అంతటితో ఆగకుండా ఫ్లోర్ క్లీన్ చేసే లిక్విడ్ (ఫ్లోర్ క్లీనర్) త్రాగాడు. చుట్టూ ఉన్నవారు ఎంత సర్ధిచెప్పిన వినకపోవడంతో స్థానికులు 100కు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు.. మొదటి అంతస్తు పైకెక్కి హల్చల్ చేస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే 108 కి ఫోన్ చేశారు. అంబులెన్స్ లో అతనికి ప్రథమ చికిత్స చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: షామా కేక్‌పై మళ్లీ రచ్చ.. టేస్ట్ చూడాలంటే రోహిత్ కంటే ఫిట్‌గా ఉండాలట!
Also Read: పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌కు అమెరికా బిగ్ షాక్.. ప్రయాణాలు నిషేధం !