Suicide Case : మూడు సంబంధాలు..ఆరు ప్రేమలు..సీతారాంరెడ్డి ఆత్మహత్య కేసులో సంచలనం

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సురసాని సీతారాంరెడ్డి ఆత్మహత్య కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మృతుడు రాసిన 19 పేజీల సుదీర్ఘమైన మరణ వాంగ్మూలం (సూసైడ్ నోట్) బయటకు రావడంతో, ఈ కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

New Update
Suicide

Suicide Case

Suicide Case: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సురసాని సీతారాంరెడ్డి ఆత్మహత్య కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఫిబ్రవరిలో జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించి మృతుడు రాసిన 19 పేజీల సుదీర్ఘమైన మరణ వాంగ్మూలం (సూసైడ్ నోట్) బయటకు రావడంతో, ఈ కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన భార్య రేణుక వివాహేతర సంబంధాలు, ఆమె ప్రవర్తన కారణంగానే తాను ప్రాణాలు తీసుకుంటున్నట్లు సీతారాంరెడ్డి ఆ లేఖలో కళ్లకు కట్టినట్లు వివరించారు.

ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన సీతారాంరెడ్డికి, నంద్యాల జిల్లాకు చెందిన రేణుకతో 2018లో వివాహమైంది. హైదరాబాద్‌లోని బాచుపల్లిలో నివాసం ఉంటూ ఆయన ఐటీ ఉద్యోగిగా నెలకు రూ. 2 లక్షల వరకు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించేవారు. అయితే, తన భార్యకు పెళ్లయిన తర్వాత కూడా ముగ్గురితో అక్రమ సంబంధాలు ఉన్నాయని, సుమారు 6 ప్రేమ కథలు నడిపిందని సీతారాంరెడ్డి తన లేఖలో ఆరోపించారు. ముఖ్యంగా రమణారెడ్డి అనే వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉన్న ప్రైవేట్ వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షమవ్వడంతో సీతారాంరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆ వీడియోలను తొలగించాలని కోరినప్పటికీ నిందితులు పట్టించుకోకపోగా, తన భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆయన కుంగిపోయారు.

ఈ కేసులో మరో షాకింగ్ విషయం ఏమిటంటే, భర్త చనిపోయిన దుఃఖం ఏమాత్రం లేకుండా, సీతారాంరెడ్డి మరణించిన కేవలం నెల రోజులకే (మార్చిలో) రేణుక తన ప్రియుడైన రమణారెడ్డిని వివాహం చేసుకుంది. అంతకుముందు కూడా ఒకసారి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన భార్యను సీతారాంరెడ్డి కాపాడుకుని, పుట్టింటి నుంచి మళ్ళీ ఇంటికి తెచ్చుకున్నారు. కానీ, మూడు ఏళ్ల కుమారుడిని ఇంట్లోనే వదిలేసి ఆమె మళ్లీ ప్రియుడి వద్దకు వెళ్లడం, కొత్త సిమ్ కార్డుల కోసం ప్రయత్నించడం వంటి పరిణామాలతో సమాజంలో తల ఎత్తుకోలేక ఫిబ్రవరి 9న హుస్సేన్ సాగర్‌లో దూకి ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు.

మృతుడి తండ్రి వెంకటేశ్వరరెడ్డి తన కుమారుడికి జరిగిన అన్యాయంపై మీడియా ముందు వాపోయారు. పోలీసులు నిందితులపై చర్యలు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శించారని ఆయన ఆరోపించారు. సీతారాంరెడ్డి తన వాట్సాప్ స్టేటస్‌లో 19 పేజీల లేఖను పెట్టి ఆత్మహత్య చేసుకున్నా, నిందితులను అరెస్ట్ చేయడానికి సమయం పట్టిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు బాచుపల్లి పోలీసులు సమగ్ర విచారణ జరిపి, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు గానూ భార్య రేణుకతో పాటు ఆమె ప్రియులు రమణారెడ్డి, శ్రవణ్‌లను ఏప్రిల్ 21న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో ఇద్దరు చిన్న పిల్లలు అనాథలయ్యారు.

Advertisment
తాజా కథనాలు