/rtv/media/media_files/2025/02/16/URr4eiYxCtN9zGeCTVcx.jpg)
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముగ్గురు నిందితులను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. సిద్దిపేటకు చెందిన జి.చక్రధర్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి హరీశ్‌రావుతతో పాటుగా, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుతోపాటు మరికొందరిపై పోలీసులు గతేడాది వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
హరీష్ రావు మంత్రిగా ఉన్న సమయంలో
అయితే ఈ కేసులో సిద్దిపేటకు చెందిన తోడుపునూరి సంతోష్‌కుమార్, బండి పరశురాములు, తెల్జీర్ వంశీకృష్ణలను పంజాగుట్ట పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హరీష్ రావు మంత్రిగా ఉన్న సమయంలో ఆయన క్యాంప్ ఆఫీస్ (పేషి)లో పనిచేసిన వంశీకృష్ణ పనిచేశారు. వంశీకృష్ణ సొంతూరు సిద్ధిపేట కాగా నల్గొండ జిల్లా ఆరోగ్యశ్రీ మేనేజర్ గా వ్యవహరించాడు. అక్కడ అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించడంతో అతని తొలిగించారు ఉన్నతాధికారులు. అనంతరం 2023లో హరీష్ రావు పేషీలో ఉద్యోగిగా చేరాడు. దాదాపు ఆరునెలల పాటు పని చేశాడు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో వంశీకృష్ణకు సహకరించిన సంతోష్‌కుమార్, .పరశురాములును పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నట్లుగా డీసీపీ విజయ్‌కుమార్ వెల్లడించారు. వీరికి న్యాయస్థానం ఫిబ్రవరి 28 వరకు రిమాండ్ విధించింది. దీంతో వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు.
Also Read : తొక్కిసలాట ఘటన.. భార్య, కూతురు మిస్, చనిపోయిన తల్లి.. బాధితుల ఆర్తనాదాలు!
డీఎస్పీ ప్రణీత్‌రావు సహాయంతో సిద్దిపేటలో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసి 2023 నుంచి తన ఫోన్‌తోపాటు, తన భార్య, కుటుంబ సభ్యులు, డ్రైవర్ సహా అందరి ఫోన్లనూ ట్యాప్ చేశారని చక్రధర్‌గౌడ్ ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో తనపై అక్రమ కేసులు పెట్టి పలు రకాలుగా వేధించారని చక్రధర్‌గౌడ్ ఆరోపణలు చేశారు. ఈ కేసులో ఏ1గాహరీష్ రావు, ఏ2గా రాధాకృష్ణన్ రావులు ఉన్నారు.
Also Read : ఇట్స్ అఫీషియల్.. డాకూ మహారాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఆరోజే