SLBC: కార్మికులను కాపాడడంలో ప్రధాన ఇబ్బంది ఇదే.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన!

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు ప్రభుత్వం శ్రమిస్తోంది. ఈ క్రమంలో టన్నెల్ వద్ద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. ఇలాంటి ప్రమాదం ఉత్తరఖాండ్ లో జరిగింది. ఇది దేశ చరిత్రలో 3 వ టన్నెల్ ప్రమాదమని నిపుణులంటున్నారు.

New Update
SLBC Tunnel

SLBC Tunnel

 SLBC: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్నవారిని బయటకు తీయడానికి ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో టన్నెల్ వద్ద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. ఇది భారత దేశ చరిత్రలో 3 వ టన్నెల్ ప్రమాదంగా నిపుణులు చెబుతున్నారన్నారు. ఇలాంటి టన్నెల్ ప్రమాదం ఉత్తరఖాండ్ లో జరిగింది. అయితే అక్కడ రెండు చోట్ల ఎగ్జిట్స్ ఉండటం వల్ల టన్నెల్ లో చిక్కుకున్నవారిని కాపాడటం సులువైందన్నారు. కానీ, ఇక్కడ ఒకసైడ్ మాత్రమే ఉండటం వల్ల ప్రమాదంలో చిక్కుకున్నవారిని కాపాడటం కాస్త ఇబ్బందిగా మారిందన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు జీయోలాజికల్ నిపుణుల సలహా మేరకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.ప్రమాదంలో చిక్కుకున్నవారిని బయటకు తెచ్చేందుకు చెయ్యాల్సిన అన్ని మార్గాల్లో ప్రయత్నం చేస్తున్నామన్నారు.

ఇది కూడా చదవండి: Nalgonda: పంటపోలాల్లో నోట్ల కట్టల కలకలం.. బ్యాంక్ పేరు చూసి కంగుతిన్న పోలీసులు!

 ఈ ప్రాజెక్ట్ మంజూరి చేయించడంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు మొదటి నుంచి కష్టపడ్డారని ఉత్తమ్‌ తెలిపారు. ఎస్.ఎల్.బీ.సి ప్రమాదం అనుకోకుండా జరిగిన ప్రమాదం అన్న ఆయన టన్నెల్ లో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు మా ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతున్నదన్నారు. ప్రపంచంలో గొప్ప గొప్ప ఇంజనీర్లను పిలిపించాం.భాధితులను రక్షించడం కోసం 10 సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయని తెలిపారు. నీటి లీకేజి వల్ల బురద జారి ప్రమాదం జరిగిందని ఇంజనీర్లు చెబుతున్నారు.అక్కడ బురద పేరుకు పోవడం వలన రెస్క్యూ కొంత ఇబ్బందిగా మారిందన్నారు. ఇండియన్ ఆర్మీ, నేవి, NDRF, నేషనల్ జియో సెన్సింగ్ ఏజెన్సీ, స్టేట్ డిజాస్టర్ ఫోర్స్, సింగరేణి రెస్క్యూ వంటి 10 ఏజెన్సీలు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయని ఉత్తమ్‌ తెలిపారు.

Also Read: తమిళనాడులో హిందీ భాష వివాదం.. బోర్డులపై నల్ల రంగు పూస్తున్న డీఎంకే కార్యకర్తలు

ప్రమాదంతో 8 మంది ప్రాణాలతో ముడిపడ్డ సంఘటన జరిగితే ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి.వారు ఈ దుర్మార్గమైన రాజకీయాలు చేయడం మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి చురకలు అంటించారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా టన్నెల్ ప్రమాదం జరిగి 7 మంది చనిపోతే మేం రాజకీయ విమర్శలు చేయలేదని గుర్తు చేశారు. ప్రపంచంలో 3 వేల కిలోమీటర్ల టన్నెల్ తవ్విన అనుభవం రాబిన్స్ సంస్థ సొంతమని, అటువంటి రాబిన్స్ సంస్థ ఆధ్వర్యంలో టన్నెల్ పనులు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఎస్.ఎల్.బీ.సి అద్భుతమైన ప్రాజెక్ట్, ఇది పూర్తయితే శ్రీశైలంలో అడుగు భాగం నుంచి నీళ్లు తీసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే గ్రావిటి ద్వారా 30 టీఎంసి లు నీరు నల్గొండ జిల్లాకు అందించి.. జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ఉత్తమ్‌ అభిప్రాయపడ్డారు.

Also Read :  ఏనుగుల దాడిపై పవన్ దిగ్భ్రాంతి.. రూ.10 లక్షలు ఆర్థిక సాయం!

ఫ్లోరైడ్ తో ఇబ్బంది పడుతున్న లక్షల మంది జీవితాలను మార్చే ప్రాజెక్ట్ ఎస్.ఎల్.బీ.సి అని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 30 టీఎంసీల నీళ్లు ఎలాంటి విద్యుత్ గానీ, మోటార్లు గాని లేకుండా కేవలం గ్రావిటీ ద్వారా వస్తుంటే.. ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదమని అమెరికన్ రాబిన్స్ కంపెనీ ప్రతినిధి, ప్రపంచంలో టాప్ టన్నెల్ నిపుణులు గ్లెన్స్ చెప్పారని వివరించారు. ముఖ్యమంత్రితో చర్చించి మరింత ముందుకు వెళ్లేందుకు కావాల్సిన చర్యలను చేపడుతామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Sashi Tharoor: నా అవసరం పార్టీకి లేకపోతే చెప్పేయండి: శశి థరూర్‌!

Also Read :  జలియన్ వాలా బాగ్ హత్యాకాండ వెనుక కుట్ర ఏంటి? 'ది వాకింగ్‌ ఆఫ్‌ ఏ నేషన్‌' ట్రైలర్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు