CM Revanth Reddy : రాష్ట్రంలో ఏ ఉప ఎన్నికలు రావు....రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఆనాడు పార్టీ మారిన వాళ్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినా.. ఉప ఎన్నికలు రాలేదు. గతంలోనే రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయి? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

New Update
 Telangana CM Revanth Reddy

Telangana CM Revanth Reddy

 CM Revanth Reddy :  ఆనాడు పార్టీ మారిన వాళ్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినా.. ఉప ఎన్నికలు రాలేదు. గతంలోనే రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయి? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆచరించిన సంప్రదాయాలనే ఇప్పుడు మనం ఆచరిస్తున్నాం. సభ్యులెవరూ ఆందోళన చెందొద్దు.. ఏ ఉప ఎన్నికలు రావు..మా దృష్టి ఉప ఎన్నికలపై లేదు., మా దృష్టి రాష్ట్ర అభివృద్ధిపైనే అని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షానికి మేం సూచన చేస్తున్నాం. మీ పై మాకు ద్వేషం లేదు.. ప్రజలు మిమ్మల్ని ఎప్పుడో శిక్షించారు.. ఇక మీపై మాకు కోపం ఎందుకుని ఉంటుంది? ప్రభుత్వానికి సహేతుకమైన సలహాలు, సూచనలు ఇవ్వండి అని సూచించారు.

Also Read: పోలీసుస్టేషన్‌ లోనే భర్త ముఖం పగలకొట్టిన ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ ఛాంపియన్!

ఎవరైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహించినా, నిర్వహణలో భాగస్వాములైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌ వ్యాఖ్యానించారు.అవసరమైతే చట్ట సవరణ చేసి శిక్షను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వ్యసనాలకు తెలంగాణలో తావులేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని కొందరు మాట్లాడుతున్నారు . ఏ చిన్నసంఘటన జరిగినా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. నడిబజారులో న్యాయవాద దంపతులను నరికి చంపితే ఆనాటి ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. ఆనాటి వెటర్నరీ డాక్టర్ అత్యాచార ఘటన విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని రేవంత్‌ గుర్తు చేశారు.

Also Read :  ఛోక్సీ మా దేశంలోనే ఉన్నాడు: బెల్జియం!

మహిళలపై జరిగిన అత్యాచారాల్లో 2020 లో దేశంలోనే రాష్ట్రం నాలుగో స్థానంలో ఉంది  బాధితులపై సానుభూతితో ఉండి…నేరగాళ్లపై కఠినంగా వ్యవహరించాలి. కానీ ఇలాంటి ఆరోపణలు చేసి ప్రభుత్వంపై దురుద్ధేశాన్ని ఆపాదిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా శాంతిభద్రతలు క్షీణించాయని దురుద్దేశంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధిపై యాసిడ్ దాడులు చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రాన్ని దివాళా తీయించి తెలంగాణ ప్రతిష్టను మసకబార్చేలా కుట్రలు చేస్తున్నారన్నారు. ఈ కుట్రలను తెలంగాణ సమాజం సహించదని సీఎం స్పష్టం చేశారు.15 నెలలుగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పాలన సాగిస్తున్నామన్నారు. 

Also Read :  మంత్రి కోమటిరెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భేటీ.. పార్టీ మార్పుపై కీలక ప్రకటన!
 
ముఖ్యమంత్రిగా నా దగ్గరకు తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తా .గజ్వేల్ శాసనసభ్యుడు వచ్చినా.. ఆ నియోజకవర్గ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. మొన్న పద్మారావు తన నియోజకవర్గంలో సమస్యలపై కలిశారు… వెంటనే ఆదేశాలు ఇచ్చామని సీఎం తెలిపారు. మేం మంచిని మంచి అంటాం.. చెడును చెడు అంటాం.. మాకు చెడు ఆలోచనలు లేవు. మమ్మల్ని బదనాం చేస్తే మీరు మంచి వారు కాలేరన్నారు..

Also Read :  ఫార్మ్-డీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. రాజమండ్రిలో హై టెన్షన్

 హరీష్ రావును సూటిగా అడుగుతున్నా ..రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలా వద్దా?  రేడియల్ రోడ్లు వేయాలా వద్దా? అభివృద్ధి కోసం భూములు సేకరించాలా వద్దా? ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలా వద్దా? అని సీఎం ప్రశ్నించారు.
కొండపోచమ్మ సాగర్ నుంచి ఫామ్ హౌస్ లకు డైరెక్టు కాలువలు తీసుకెళ్లింది ఎవరు? ప్రతీది అడ్డుకోవాలనే కుట్ర ఏ రకంగా మంచిది? మేం తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం.. మొత్తం తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం. 
మీ కుట్రలు, కుతంత్రాలకు, అసెంబ్లీలో మైకును వాడుకుంటామంటే ఒప్పుకోం.  అభివృద్ధి, భూసేకరణ విషయంలో మీరు అడ్డుపడకండి.పరిహారం ఏం ఇవ్వాలో సూచనలు చేయండి. ఇది ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చేదే తప్ప.. ఎవరి ఇంట్లో నుంచి ఇచ్చేది కాదు.మల్లన్న సాగర్ లో, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో …కేసులు వేయించింది వాళ్లే, పార్టీలో చేర్చుకున్నది వాళ్లే అని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

Also Read :  రషీద్ ఖాన్ అరుదైన రికార్డు.. మలింగ, బుమ్రాలతో కలిసి

ఆనాడు పార్టీ మారిన వాళ్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినా.. ఉప ఎన్నికలు రాలేదు. గతంలోనే రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయి? గతంలో ఆచరించిన సంప్రదాయాలనే ఇప్పుడు మనం ఆచరిస్తున్నాం. సభ్యులెవరూ ఆందోళన చెందొద్దు.. ఏ ఉప ఎన్నికలు రావు..మా దృష్టి ఉప ఎన్నికలపై లేదు., మా దృష్టి రాష్ట్ర అభివృద్ధిపైనే అని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షానికి మేం సూచన చేస్తున్నాం. మీ పై మాకు ద్వేషం లేదు.. ప్రజలు మిమ్మల్ని ఎప్పుడో శిక్షించారు.. ఇక మీపై మాకు కోపం ఎందుకుని ఉంటుంది? ప్రభుత్వానికి సహేతుకమైన సలహాలు, సూచనలు ఇవ్వండి అని సూచించారు.

Also Read :  MMTSలో యువతిపై అత్యాచారయత్నం కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితుడు అతడు కాదు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Husband attacks wife : కొండాపూర్ లో దారుణం.. గ‌ర్భిణి అయిన భార్యను చంపాలని...

కొండాపూర్‌లో నడిరోడ్డుపై దారుణం చోటుచేసుకుంది..గ‌ర్భిణిని చంపేందుకు భ‌ర్త యత్నించడం కలకలం రేపింది. గర్భవతిగా ఉన్న భార్యను ఆసుపత్రికి తీసుకువచ్చిన ఓ భర్త బండరాయితో మోదీ హత్య చేసేందుకు యత్నించాడు. తీవ్ర గాయాలపాలైన మహిళ అపస్మారక స్థితిలో చికిత్స పొందుతుంది. 

New Update
Husband attacks wife

Husband attacks wife

Husband attacks wife : కొండాపూర్‌లో నడిరోడ్డుపై దారుణం చోటుచేసుకుంది.. గ‌ర్భిణిని చంపేందుకు భ‌ర్త యత్నించడం కలకలం రేపింది. గర్భవతిగా ఉన్న భార్యను ఆసుపత్రికి తీసుకువచ్చిన ఓ భర్త బండరాయితో మోదీ హత్య చేసేందుకు యత్నించాడు. నడిరోడ్డు మీద భార్యపై దాడి చేసి దాదాపు పది నుంచి పదిహేను సార్లు బండరాయితో మోదడంతో తీవ్ర గాయాలపాలైన మహిళ చావుబ‌తుకుల మధ్య ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతుంది. 

Also read :  మరికొన్ని రోజుల్లో పెళ్లి... కాబోయే భర్త కళ్లముందే యువతి మృతి!
 
 గర్భవతిగా ఉన్న భార్యను ఆసుపత్రికి తీసుకువచ్చిన ఓ భర్త ఏం జరిగిందో ఏమో గానీ, ఒకసారిగా భార్యమీద దాడి చేశాడు.బండరాయితో మోదీ హత్య చేసేందుకు యత్నించాడు. నడిరోడ్డు మీద భార్యపై దాడి చేసి దాదాపు పది నుంచి పదిహేను సార్లు బండరాయితో మోదడంతో తీవ్ర గాయాలపాలైంది. ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మీద దాడి చేసిన నిందితుడిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దాడి దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

పోలీసుల కథనం ప్రకారం… వికారాబాద్‌కు చెందిన ఎండి బస్రత్ (32) బ‌తుకుదెరువు కోసం నగరానికి వచ్చి ఇంటీరియర్ పనులు చేసుకుంటూ కుటుంబంతో కలిసి హఫీజ్ పేట్ పరిధిలోని ఆదిత్యనగర్‌లో నివాసం ఉంటున్నాడు. కాగా 2023 జనవరిలో అజ్మీర్ దర్గాకు వెళ్లే క్రమంలో ప్రయాణంలో బస్రత్‌కు కోల్‌క‌తాకు చెందిన షబానా పర్వీన్(22) పరిచయం అయ్యింది. వీరి పరిచయం ప్రేమగా మారగా, 2024 అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్నారు.వివాహం అనంతరం ఇద్దరు హఫీజ్ పేట్ ఆదిత్యనగర్‌లో కాపురం పెట్టగా, బస్రత్ ఇంటీరియర్ డిజైన్ పనులు చేస్తున్నాడు. పెళ్లి అనంతరం మొదట అత్తామామలతో కలిసి ఉండగా, కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి.

 Also read: Rameswaram: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

 దీంతో బస్రత్, షబానా పర్వీన్‌లు స్థానికంగా వేరు కాపురం పెట్టారు. ప్రస్తుతం షబానా పర్వీన్ రెండు నెలల గర్భిణి కాగా, మార్చి 29న పర్వీన్‌కు వాంతులు కావడంతో కొండాపూర్ రాఘవేంద్రకాలనీలోని సియా లైఫ్ ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తరువాత పర్వీన్‌ను ఏప్రిల్ 1వ తేదీన రాత్రి డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి బయటకు రావడంతోనే, హాస్పిటల్ ముందే భార్యాభర్తలకు గొడవ జరిగింది. ఇద్దరి మద్య మాటామాటా పెరగడంతో బస్రత్ ఒక్కసారిగా తన భార్య పర్వీన్ మీద దాడికి తెగబడ్డాడు. నడిరోడ్డు మీద పెనుగులాటలో కిందపడిన భార్య మీద అక్కడే ఉన్న బండరాయితో దాడి చేశాడు. దాదాపు 10 నుంచి 12సార్లు రాయితో మోదడంతో పర్వీన్ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి వెళ్లింది. చనిపోయిందని భావించిన బస్రత్ అక్కడి నుంచి పారిపోయాడు.

Also read: Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి

ఈ ఘ‌ట‌న‌ను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పర్వీన్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా పర్వీన్ పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు మియాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి నుంచి నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కోమాలో ఉన్న పర్వీస్ ప్రాణాలతో పోరాడుతుంది. పర్వీన్ కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు నిందితుడు బస్రత్‌ను ఈనెల 3న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read : Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి

 

 

Advertisment
Advertisment
Advertisment