Uttam Kumar Reddy : రాష్ట్రంలో గ్యాస్‌ కొరతలేదు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టీకరణ

తెలంగాణలో గ్యాస్‌ కొరతలేదని ముఖ్యంగా డోమోస్టిక్ సిలిండర్ లకు ఎలాంటి ఇబ్బందులు లేవని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా LPG సిలెండర్ సప్లయ్ విషయం లో వాస్తవ పరిస్థితులపై ఈ రోజు సమీక్ష జరిపినట్లు ఆయన తెలిపారు.

New Update
Uttam Kumar reddy

Uttam Kumar reddy

Uttam Kumar Reddy : తెలంగాణలో గ్యాస్‌ కొరతలేదని ముఖ్యంగా డోమోస్త్రిక్ సిలిండర్ లకు ఎలాంటి ఇబ్బందులు లేవని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా LPG సిలెండర్ సప్లయ్ విషయం లో వాస్తవ పరిస్థితులపై ఈ రోజు సమీక్ష జరిపినట్లు ఆయన తెలిపారు. నిన్న కూడా ఇదే విషయం పై మంత్రి తుమ్మల, CS తో సమీక్షా నిర్వహించామన్నారు.CS, తో పాటు జిల్లా కలెక్టర్ లతో కమిటీ లను వేస్తూ GO విడుదల చేసామన్నారు.LPG, ఆయిల్ సప్లై ప్రతినిధులతో ఈరోజు రివ్యూ ఏర్పాటు చేశానని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 1.3 కోట్లు LPG కస్టమర్లు ఉన్నారన్నారు.

కమర్షియల్  సిలిండర్ 19 kg ల సైజు లో ఉంటుందని, డోమోస్టిక్ సిలిండర్ సైజ్ 14 kgలు ఉంటుందని మంత్రి అన్నారు.7.5 లక్షలు కమర్షియల్  కస్టమర్లు ఉన్నారన్నారు.ప్రతి నెల 58 లక్షల నుంచి 60 లక్షల  డోమోస్త్రిక్ సిలిండర్ వాడుతున్నారని మంత్రి వివరించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలుఆందోళన చెంది ఎక్కువగా బుక్ చేస్తున్నారన్నారు. వాస్తవానికి డోమోస్త్రిక్ సిలిండర్ లకు ఎలాంటి ఇబ్బందులు లేవని మంత్రి వివరించారు. కమర్షియల్ సిలిండర్ లను 20 శాతం సప్లై చేస్తున్నామన్నారు.

కమర్షియల్  సిలిండర్ లలో కొంత కొరత ఉన్నప్పటికీ గృహ అవసరాలకు సిలిండర్ల ఇబ్బందులు లేవని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వివరించారు. గృహ అవసరాల కోసం ప్రతి రోజు 2.15 లక్షల గ్యాస్‌ సిలిండర్లు సప్లై చేస్తున్నారన్నారు. కమర్షియల్  సిలిండర్  ప్రతి రోజు 23 వేలు సప్లై చేస్తున్నారన్నారు. అయితే ఇప్పుడు కేవలం 6 వేల 200 వేలు మాత్రమే ఇస్తున్నారని, 1740 స్టాండ్ బై గా పెట్టడం జరిగిందన్నారు. గ్యాస్‌ సరఫరాకు ప్రభుత్వ పాఠశాల లు హాస్పిటల్స్ లకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. బ్లాక్ మార్కెట్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సివిల్ సప్లై కార్యాలయం లో దీనిపై హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసామన్నారు. ఎవైనా సందేహలు ఉంటే హెల్ప్ లైన్ నెంబరు 18004250033 కు కాల్‌ చేయాలని మంత్రి వివరించారు.

Advertisment
తాజా కథనాలు