/rtv/media/media_files/2025/01/21/v3ASNxJ2aydebZJcMENW.jpg)
TG RTC workers' strike
TG RTC : తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 22 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. మార్చి 13న సమ్మె నోటీసులు ఇచ్చామని కానీ, ప్రభుత్వం, యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదని జేఏసీ తెలిపింది. 32 డిమాండ్లతో సమ్మెకు వెళ్తున్నామని జేఏసీ స్పష్టం చేసింది. ప్రభుత్వం, యాజమాన్యం ముందు 32 డిమాండ్లు పెట్టినట్లు జేఏసీ వైస్ ఛైర్మన్ థామస్‌రెడ్డి తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాగా, ఆర్టీసీ జేఏసీ నేతలు ఈ నెల 9న ఆర్టీసీ క్రాస్ రోడ్​లోని కార్మిక శాఖ కార్యాలయంలో లేబర్ డిపార్ట్​మెంట్ అధికారులతో సమావేశమయ్యారు. ఇప్పటికైనా ప్రభుత్వం, యాజమాన్యం కార్మికుల సమస్యల పరిష్కారంపై దృష్టిసారించి తమ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించాలని కోరారు. ఇప్పటికే కార్మిక శాఖకు, తమ యాజమాన్యానికి సమ్మెనోటీస్ ఇచ్చామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి అంటే గత రెండేన్నరేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని జేఏసీ ఛైర్మన్ ఈదురి వెంకన్న డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ఆర్టీసీని విస్తరిస్తామనడం మంచిదే కానీ, ఆ పేరుతో ఆర్జీసీ నిర్వీర్యం చేయడం సరికాదన్నారు. ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం వల్ల ఆర్జీసీ గుత్తేదారుల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని ఆయన హచ్చరించారు. అందువల్ల వాటిని ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు.
కాగా, కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలపి వెంకన్న కోరారు. ఏ ఒక్క సమస్య పరిష్కారం కాకపోవడం వల్లనే కార్మికుల ఆవేదనతో ఉన్నారని, అందుకే సమ్మెకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. ఒక వేళ ఏదైనా పరిస్థితుల వల్ల ఆర్టీసీ సమ్మె జరిగితే దానికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
Follow Us