Revanth Reddy : కర్మ సిద్ధాంతాన్ని అనుభవించాల్సిందే..రేవంత్‌కు ఎమ్మెల్సీ కవిత చురకలు

గతంలో కేసీఆర్ గారితో పాటు తమ కుటుంబంలోని చంటి పిల్లలను కూడా వదిలిపెట్టకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు, ఇప్పుడు అవి తిరిగి ముఖ్యమంత్రికే వస్తున్నాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చురకలంటించారు.

New Update
Kavitha Vs Revanth Reddy

Kavitha Vs Revanth Reddy

Revanth Reddy : గతంలో కేసీఆర్ గారితో పాటు తమ కుటుంబంలోని చంటి పిల్లలను కూడా వదిలిపెట్టకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవి తిరిగి ముఖ్యమంత్రికే వస్తున్నాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చురకలంటించారు. "మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్లం. ఇవాళ ఏం చేస్తామో మళ్ళీ అది మనకు వాపస్ వస్తుంది. గత ఐదారు సంవత్సరాలలో వాళ్లు చేసిన పనే తిరిగి వాళ్లకు చుట్టుకుంటున్నదని. అది ఎవరు చేయిస్తున్నది కాదు. "అని కవిత వ్యాఖ్యానించారు. 

Also read: కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు.. భగ్గుమన్న బీజేపీ

శాసనమండలి ఆవరణలో ఎమ్మెల్సీ కవిత విలేకరులతో మాట్లాడుతూ... ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేశారని, ఆ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే బట్టలు ఊడదీసి ఊరేగిస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. తెలంగాణ చరిత్రలో ఇది చీకటి రోజని స్పష్టం చేశారు. మహిళలను రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తూనే, తన ఇంట్లోని మహిళలను తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూనే, కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తానని అంటూనే ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయనకు తగదు అని కవిత సూచించారు.

Also read: Firing: కాంగ్రెస్ మాజీ MLAపై కాల్పులు.. ఇంటిపై నలుగురు అటాక్

బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ గారి మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయోగించిన భాషను తెలంగాణ సమాజమంతా వ్యతిరేకిస్తున్నది కాబట్టి తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ హుందాగా రాజకీయాలు చేస్తుందని, ముఖ్యమంత్రి ప్రయోగించిన భాషను తాము ప్రయోగించలేమని, కాబట్టి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. 

ఇది కూడా చూడండి: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!

శాసనమండలి ఆవరణలో ఎమ్మెల్సీ కవిత విలేకరులతో మాట్లాడుతూ... ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేశారని, ఆ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే బట్టలు ఊడదీసి ఊరేగిస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. తెలంగాణ చరిత్రలో ఇది చీకటి రోజని స్పష్టం చేశారు. మహిళలను రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తూనే, తన ఇంట్లోని మహిళలను తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూనే, కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తానని అంటూనే ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయనకు తగదు అని సూచించారు.

Also Read: హిందీ భాష రుద్దడంపై పవన్‌ వ్యాఖ్యలు దుమారం.. స్పందించిన డీఎంకే
 
మంత్రులు కూడా చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారని, సభలో ఉంటే ఉండండి లేదంటే వెళ్లిపోండి అని చాలా దురుసుగా దురాహంకారంతోటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను ఉద్దేశించి మాట్లాడారని విమర్శించారు. ఇటువంటి అహంకార పూరితమైన వ్యాఖ్యలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనా చారికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నదని మండిపడ్డారు.

Also Read: డీలిమిటేషన్‌ వల్ల సీట్లు తగ్గుతాయా ? కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు