CM Revanth Reddy : మంచిని మైకులో చెప్పాలి..చెడును చెవిలో చెప్పాలి..కానీ మీరు... సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం గాంధీ భవన్ లో జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ కొత్త ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్లు చెడును మైక్ లో, మంచిని చెవిలో చెప్తున్నారన్నారు.

New Update
TPCC Executive Meeting.Live from Gandhi Bhavan

TPCC Executive Meeting.Live from Gandhi Bhavan

CM Revanth Reddy: టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం గాంధీ భవన్ లో జరిగింది. టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ కొత్త ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచి మైకులో...చెడును చెవిలో చెప్పాలి.కానీ సీనియర్లు చెడును మైక్ లో... మంచిని చెవిలో చెప్తున్నారని ఆరోపించారు.ఇది ఇది పార్టీకి ఏమాత్రం మంచిది కాదని రేవంత్‌ అన్నారు. పదవులు వచ్చిన వారు పదవీ వచ్చిందని పని చేయడం లేదని, రానివారు రాలేదని పని చేయడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ గ్యాప్ ను  భర్తీ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Also Read: తాగొచ్చి కొట్టేవాడు...ఇంటినుంచి గెంటేశాడు.. మానవ్ శర్మ భార్య సంచలన కామెంట్స్

 పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది అని తెలిపారు. పని చేసిన వారి జాబితాను కొత్త ఇంఛార్జ్ సిద్ధం చేస్తారు.. కొందరికి పదవులు రాలేదు.. మొదటి విడతలో కార్పొరేషన్ చైర్మన్లు రెండేళ్లు అవకాశం ఇచ్చాం.. పని తీరు సరిగ్గా లేని వారిని కొనసాగించలేమని పేర్కొన్నారు. ఇప్పుడు ఏం అనను.. రెన్యువల్ కోసం వస్తారు కదా అప్పుడు చెప్తానని తెలిపారు. పదవి వచ్చింది కదా అని కూర్చున్న వాళ్లకు కొనసాగింపు ఉండదు అని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు.

ఇది కూడా చూడండి: Uttarakhand: ఉత్తరాఖండ్‌లో దారుణం.. హిమపాతంలో చిక్కుకున్న 57 మంది కార్మికులు
 
ఇక, మార్చి 10వ తేదీ లోపు ఇంఛార్జ్ మంత్రులు జిల్లాకు వెళ్ళండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దేవాదాయ కమిటీలు, మార్కెట్ కమిటి డైరెక్టర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి.. వాటికి సంబంధించిన జాబితా సిద్ధం చేయండి.. అందరికీ పదవులు ఇచ్చేద్దాం.. అలాగే, పదవులు వచ్చిన వాళ్ళు.. పదవి వచ్చింది నేను ఎందుకు పని చేయడం అనుకుంటున్నారు.. పదవి రాని వారు, పదవి రాలేదు కదా నేననేందుకు పని చేయడం అని అనుకుంటున్నారు.. మంచిని మైక్ లో చెప్పండి.. ఇదే, పార్టీ నాయకులకు నా విజ్ఞప్తి.. ఏదైనా సమస్య అంటే చెవిలో చెప్పండి అన్నారు. గుజరాత్ మోడల్ సక్సెస్ మోడల్ కాదు.. ఆయన ప్రమోట్ చేసుకున్నారు.. టాక్స్ కలెక్షన్ లో తెలంగాణ నే టాప్.. ఆరో ప్లేస్ లో గుజరాత్ ఉంది.. విదేశీ పెట్టుబడులు తెచ్చింది తెలంగాణ. అత్యధిక వరి ధాన్యం పండించిన మొదటి రాష్ట్రం తెలంగాణ.. కాళేశ్వరం లేకుండానే కోటి 56 లక్షల టన్నులు పండించామని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.

Also Read: ఈశా ఫౌండేషన్‌కు బిగ్‌ రిలీఫ్‌.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం

Advertisment
Advertisment
Advertisment