GIRL MURDERED BY FATHER : కన్నతండ్రే కాలయముడు...ముక్కు,నోరు మూసి చిన్నారిని చంపేసి...

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్నతండ్రే కాలయముడిగా మారి కన్నబిడ్డను పొట్టనపెట్టుకున్నాడు. పాప ఏడుస్తుందని బిడ్డ ఊపిరి తీశాడు కసాయి తండ్రి. ముక్కు,నోరు మూసి చిన్నారిని తండ్రి శ్రీరామ్‌ చంపేశాడు.  

New Update
Woman body found stuffed inside bed box in outer Delhi

Woman body found stuffed inside bed box in outer Delhi

GIRL MURDERED BY FATHER : యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్నతండ్రే కాలయముడిగా మారి కన్నబిడ్డను పొట్టనపెట్టుకున్నాడు. పాప ఏడుస్తుందని బిడ్డ ఊపిరి తీశాడు కసాయి తండ్రి. ముక్కు,నోరు మూసి చిన్నారిని తండ్రి శ్రీరామ్‌ చంపేశాడు.  పూర్తి వివరాల ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.  హయత్‌నగర్‌కు చెందిన శ్రీరామ్‌, నాగరాణిలకు 3 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. కాగా,  బధిరులైన వీళ్లద్దరికి 23 నెలల కూతురు చిన్నారి నిత్యశ్రీ ఉంది. శ్రీరామ్‌ హన్మాపురంలో నీటిశుద్ధి ప్లాంట్‌లో పనిచేస్తున్నాడు. కాగా, పాప పుట్టినప్పటి నుంచి భార్యభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. గొడవలు జరిగిన ప్రతిసారి నాగరాణి అలిగి పుట్టింటికి వెళ్లిపోతుంది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో ఇటీవల పుట్టింటికి వెళ్లిన నాగరాణితో పాటు బిడ్డ నిత్యశ్రీని 20 రోజుల క్రితమే ఇంటికి తీసుకొచ్చాడు. అయితే ఎక్కువ రోజులు అమ్మమ్మ వాళ్లింట్లో ఉండటంతో ఇక్కడికి వచ్చిన తర్వాత నిత్యశ్రీ తాతపై బెంగపెట్టుకుంది. రోజు ఏడుస్తుండంతో నాగరాణి తండ్రికి పోన్‌ చేసి విషయం తెలిపింది. దీంతో  మనుమరాలిని తీసుకెళ్లేందుకు శ్రీరామ్ ఇంటికొచ్చాడు తాత మల్లయ్య.
 
 
తాత వచ్చిన సంబురంతో నిత్యశ్రీ వెళ్లి తాత ఒడిలో కూర్చుంది. అయితే ఇది నచ్చని శ్రీరామ్‌ మల్లయ్య ఒడిలో ఉన్న చిన్నారిని బలవంతంగా లాక్కోని బయటకు తీసుకెళ్లాడు. బయటకు తీసుకెళుతుండగా నాగారాణి అడ్డుకోవడంతో ఆమెపై శ్రీరామ్‌ చేయి చేసుకున్నాడు. దీంతో చిన్నారి మరింత గుక్కపట్టి ఏడవడం మొదలు పెట్టింది. తాతను గుర్తు చేసుకుని ఏడ్వడం నచ్చని శ్రీరామ్‌ చిన్నారి నోరు ముక్కు బలవంతంగా మూశాడు. దీంతో ఊపిరాడక తండ్రి చేతిలోనే చిన్నారి ప్రాణాలు విడిచింది. దీంతో తల్లి, తాత లబోదిబోమంటూ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. ఇంటి గొడవలకు చిన్నారి ప్రాణాలు తీసిన శ్రీరామ్‌ చర్యను పలువురు తప్పుపట్టారు. 

Advertisment
తాజా కథనాలు