/rtv/media/media_files/2026/04/04/revanth-reddy-2026-04-04-19-29-01.webp)
The development of Basara temple should be amazing
Revanth Reddy: తెలంగాణలోని ప్రముఖ ఆలయాలకు తిరుమల తరహా నిబంధనలు వర్తింపజేయాలని సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. బాసరలోని పవిత్ర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ అభివృద్ధి జరగాలని ఆయన సూచించారు. బాసర ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్‌ను సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ఆవరణలో సువిశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు. భక్తుల విశ్వాసాలు దెబ్బతినకుండా ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధిపై అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఆలయ పరిసరాల్లో విద్యుత్ వాహనాలే వాడేలా చూడాలని చెప్పారు. వీఐపీ వాహనాలు కూడా బయటే పార్కింగ్ చేయాలని సూచించారు.ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలన్నారు. సంప్రదాయాలు, శాస్త్రాలకు అనుగుణంగా అభివృద్ధి జరగాలన్నారు. ఆలయ ప్రాంగణంలో భారీ వృక్షాలు నాటాలని సూచించారు. ఆలయం సమీపంలో హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు,ఆలయ పరిసరాల్లో రాజకీయ కార్యకలాపాలు జరగకుండా చూడాలని సూచించారు.
కాగా నిర్మల్ జిల్లా గోదావరి నది ఒడ్డున ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని ప్రభుత్వం 225 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తోంది. ఇందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను అధికారులు వివరించగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. 6వ తేదీన ఈ ఆలయ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. భక్తుల విశ్వాసాలు దెబ్బతినకుండా ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Follow Us