/rtv/media/media_files/2026/06/01/tspsc-2026-06-01-17-07-14.jpg)
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం శుభవార్త చెప్పారు. ఉద్యోగాల భర్తీని జెట్ స్పీడ్‌తో పూర్తి చేయడంతో పాటు, ఎక్కడా చిన్న తప్పు కూడా జరగకుండా సరికొత్త సిస్టమ్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించారు.
3 నోటిఫికేషన్లు ఇస్తాం
ప్రస్తుతం 3,800 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ లోనే 3,093 పోస్టులు ఉన్నాయి. మిగతా డిపార్ట్‌మెంట్లలో సింగిల్ పోస్ట్ ఖాళీలు ఒక 25 వరకు ఉన్నాయి. ఇకపై నోటిఫికేషన్ల కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా, ప్రతి నెల సగటున 3 నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు. దీనికి బోనస్‌గా రేపే మూడు కొత్త నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి నిరుద్యోగుల్లో జోష్ నింపారు.
ఇకపై ఏ నోటిఫికేషన్ ఇచ్చినా, దానికి సంబంధించిన పూర్తి రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ను గరిష్టంగా ఒక ఏడాది లోపే క్లోజ్ చేస్తామని బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. అలాగే లీకేజీల గొడవ లేకుండా ఉండేందుకు కొన్ని కీలక మార్పులు చేశారు. ఇకపై టీజీపీఎస్సీ పెట్టే పరీక్షలన్నీ కంప్యూటర్ ఆధారంగా ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి. దీనివల్ల పేపర్ లీక్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే పరీక్ష పేపర్‌ను ముందే ప్రింట్ చేసి ఉంచే పాత పద్ధతికి స్వస్తి పలుకుతున్నారు. అభ్యర్థులు కంప్యూటర్ మీద ఎగ్జామ్ రాసి సబ్‌మిట్ కొట్టగానే.. తాము ఎన్ని ప్రశ్నలకు కరెక్ట్ ఆన్సర్లు పెట్టామో వెంటనే తెలిసిపోయేలా కొత్త టెక్నాలజీని తీసుకురాబోతున్నట్లు హింట్ ఇచ్చారు.
ఇదే సమయంలో ఆయన ప్రాక్టికల్‌గా ఒక విషయం చెప్పారు. అప్లై చేసిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగం రావడం కుదరదని, కేవలం 0.1 శాతం మందికి మాత్రమే జాబ్స్ వస్తాయని గుర్తుచేశారు. ఉద్యోగం రాని కొందరు నిరాశతో కమిషన్‌పై తప్పుడు ప్రచారాలు చేయడం కామనేనని, అభ్యర్థులు అలాంటి పుకార్లను అస్సలు నమ్మవద్దని కోరారు. మొత్తానికి టీజీపీఎస్సీ తీసుకుంటున్న ఈ స్పీడ్ నిర్ణయాలు నిరుద్యోగుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి.
Follow Us