T20 League : TG20 లీగ్ సమరం రెడీ... వేలంలో 'తిలక్' రికార్డు.. మైదానంలోకి తెలంగాణ సైన్యం!

తెలంగాణలో యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసేందుకు ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకున్న టీజీ20 క్రికెట్‌ లీగ్‌ (TG20 League) కోసం నిర్వహించిన ఆటగాళ్ల వేలం ఆసక్తికరంగా సాగింది. ఈ వేలంలో ఎనిమిది ఫ్రాంఛైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను దక్కించుకున్నాయి.

New Update
FotoJet - 2026-06-08T071150.772

T20 League

T20-League : తెలంగాణలో యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసేందుకు ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకున్న టీజీ20 క్రికెట్‌ లీగ్‌ (TG20 League) లో అత్యంత కీలకమైన ఘట్టం ముగిసింది. ఆదివారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ఆటగాళ్ల వేలం ప్రక్రియ ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా సాగింది. ప్రముఖ వేలం నిర్వాహకుడు చారు శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేలంలో ఎనిమిది ఫ్రాంఛైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను దక్కించుకునేందుకు 'నువ్వా-నేనా' అన్నట్లు పోటీ పడ్డాయి. మొత్తం 1,300 మంది ఆటగాళ్లు బరిలో నిలవగా.. ఎనిమిది జట్లు కలిపి 160 మంది క్రికెటర్లను కొనుగోలు చేశాయి.

FotoJet - 2026-06-08T071309.095

ఈ వేలంలో భారత టీ20 వైస్‌ కెప్టెన్‌, స్థానిక స్టార్ తిలక్‌ వర్మ రికార్డు ధర పలికాడు. లీగ్‌కు అతను అందుబాటులో ఉండడంపై కొంత అనుమానం ఉన్నప్పటికీ.. ఫ్రాంఛైజీలు అతని కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి రూ.33 లక్షల భారీ ధరతో మెదక్‌ ఫాల్కన్స్‌ అతడిని సొంతం చేసుకుంది. ఇక టీమ్‌ఇండియా మరో స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్‌ సిరాజ్‌ను వరంగల్‌ వారియర్స్‌ రూ.14 లక్షలకే దక్కించుకోవడం గమనార్హం.FotoJet - 2026-06-08T071527.711

టాప్ ధర పలికిన ఆటగాళ్లు వీరే:

వేలంలో తిలక్ వర్మ తర్వాత ఫాస్ట్‌బౌలర్‌ సీవీ మిలింద్‌ ద్వితీయ అత్యధిక ధర పలికాడు. అతడిని రూ.17 లక్షలకు అన్విత ఖమ్మం ఏసెస్‌ కొనుగోలు చేసింది. 

మిగిలిన ప్రముఖ ఆటగాళ్లలో:

రవికిరణ్‌ మాజేటి: రూ.13 లక్షలు (పాలమూరు స్ట్రెకర్స్‌)

టి.రవితేజ: రూ.12 లక్షలు (మెదక్‌ ఫాల్కన్స్‌)

ఆమన్‌ రావు పేరాల: రూ.12 లక్షలు (వరంగల్‌ వారియర్స్‌)

తనయ్‌ త్యాగరాజన్‌: రూ.11 లక్షలు (రంగారెడ్డి రైజర్స్‌)

ప్రజ్ఞయ్‌ రెడ్డి: రూ.11 లక్షలు (పాలమూరు స్ట్రైకర్స్‌)

హైదరాబాద్‌ దేశవాళీ స్టార్లు అభిరథ్‌ రెడ్డి, అజయ్‌దేవ్‌ గౌడ్‌లను చెరో రూ.11 లక్షల రేటు పెట్టి హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ దక్కించుకుంది. ఈ ఫ్రాంఛైజీ తరఫున ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్, యూకేఎమ్‌ఎల్‌ డైరెక్టర్‌ జి. సాంబశివరావుతో పాటు ఈటీవీ భారత్‌ డైరెక్టర్‌ బృహతి, ఈటీవీ డైరెక్టర్‌ సుజయ్‌లు వేలంలో పాల్గొని వ్యూహాత్మకంగా ఆటగాళ్లను ఎంపిక చేశారు.

జట్ల వారీగా అమ్ముడైన ప్రధాన ఆటగాళ్ల వివరాలు (ధర రూ.లక్షల్లో):

15008062026sp1c

హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌: అభిరథ్‌ రెడ్డి (11), అజయ్‌దేవ్‌ గౌడ్‌ (11), ప్రణవ్‌ (8.5), సాయివికాస్‌ రెడ్డి (4.25), అన్విత్‌ రెడ్డి (3.5), గణేశ్‌ గడుగు (2.5), యశ్వీర్‌ గౌడ్‌ (3), శ్రీనికేత్‌ (2.3).

15008062026sp1i

మెదక్‌ ఫాల్కన్స్‌: తిలక్‌ వర్మ (33), రవితేజ (12), విక్రమ్‌ నాయక్‌ (1.1), శశాంత్‌ (1), సూర్యతేజ (0.85).

15008062026sp1m

వరంగల్‌ వారియర్స్‌: మహ్మద్‌ సిరాజ్‌ (14), అమన్‌రావు (12), భవేశ్‌ సేత్‌ (5), రిషికేత్‌ (4.75), హర్షిత్‌ (3).

15008062026sp1k

ప్రణవ రంగారెడ్డి రైజర్స్‌: తనయ్‌ (11), సాయి యాదవ్‌ (9), జార్జ్‌ వర్గీస్‌ (7.5), అవనీశ్‌ (7), బింజ్‌రాజ్క (4), ప్రకాశ్‌ (4).

15008062026sp1j

అనురాగ్‌ నల్గొండ నైట్స్‌: అర్ఫాజ్‌ (11), రాహుల్‌ బుద్ధి (8), రక్షణ్‌ (6), నితీశ్‌ (5.5), నిశాంత్‌ (5.5), అనికేత్‌ (4.75).

15008062026sp1h

పాలమూరు స్ట్రైకర్స్‌: రవికిరణ్‌ (13), ప్రజ్ఞయ్‌ (11), రోహిత్‌ రాయుడు (6.5), ప్రతీక్‌ పవార్‌ (4.25), చైతన్య (3.25).

15008062026sp1g

కరీంనగర్‌ డైమండ్స్‌: చందన్‌ సహాని (9.5), ఆశిష్‌ శ్రీవాస్తవ్‌ (9), తన్మయ్‌ (8), రాహుల్‌ రాదేశ్‌ (4.5), ఆర్‌.దినేశ్‌ (4.5).

15008062026sp1e

అన్విత ఖమ్మం ఏసెస్‌: వ్రజేంద్ర/మిలింద్ (17), హిమతేజ (8), మికిల్‌ జైస్వాల్‌ (6), ప్రతీక్‌ రెడ్డి (3.75), సాకేత్‌ (3.5).

(ఈ ప్రధాన ఆటగాళ్లతో పాటు అన్ని జట్లు బేస్ ప్రైస్ రూ.0.75 లక్షల నుంచి రూ.2 లక్షల పరిధిలో మరికొంతమంది యువ ఆటగాళ్లను ఎంచుకుని తమ 20 మంది సభ్యుల సైన్యాన్ని పూర్తి చేసుకున్నాయి.)

జూన్ 21 నుంచి సమరం

వేలం ప్రక్రియ ముగియడంతో ఇక మైదానంలో అసలు సమరానికి తెరలేవనుంది. ప్రతిష్టాత్మక టీజీ20 లీగ్ ఈ నెల (జూన్) 21న ఘనంగా ప్రారంభం కానుంది. మొత్తం 21 రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘ టోర్నీలో లీగ్ దశ, నాకౌట్లతో కలిపి మొత్తం 32 మ్యాచ్‌లు జరగనున్నాయి. అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్న ఈ లీగ్ మహాసంగ్రామం జులై 11న జరిగే గ్రాండ్ ఫైనల్‌తో ముగుస్తుంది. తెలంగాణ క్రికెట్ చరిత్రలో మైలురాయిగా నిలవబోతున్న ఈ టోర్నీ కోసం క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


 

Advertisment
తాజా కథనాలు