HYD TERRORIST ARREST : హైదరాబాద్‌లో మరోసారి బయటపడ్డ ఉగ్రలింకులు..మహిళా అరెస్ట్‌

మరోసారి హైదరాబాద్ లో ఉగ్రలింకులు బయటపడ్డాయి. తీవ్రవాద కార్యకలపాలకు పాల్పడుతున్నారన్న సమచారంలో ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ లో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు సోమవారం ముగ్గురిని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

New Update
FotoJet (38)

HYD TERRORIST ARREST

HYD TERRORIST ARREST : మరోసారి హైదరాబాద్ లో ఉగ్రలింకులు బయటపడ్డాయి. తీవ్రవాద కార్యకలపాలకు పాల్పడుతున్నారన్న సమచారంలో ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ లో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు సోమవారం ముగ్గురిని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా వారిచ్చిన సమాచారంతో పోలీసులు పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా హైదరాబాద్‌లో మరోసారి ఉగ్రలింకులు  బయటపడ్డాయి. హైదరాబాద్‌కు చెందిన సయిదాబేగం అనే మహిళను కౌంటర్ ఇంటెలిజెన్స్ వర్గాలు అరెస్టు చేశాయి.  విజయవాడ ఉగ్రలింకుల కేసులో సయిదా బేగం కీలక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు.

నిన్న విజయవాడలో అరెస్ట్‌ చేసిన ఉగ్రవాద గ్రూపులకు చెందిన సానుభూతిపరులు మహమ్మద్ రహమతుల్లా, డానిష్, సొహైల్ బేగ్‌లను అదుపులోకి తీసుకొన్న విషయం తెలిసిందే. వారిచ్చిన సమాచారంతో పలు రాష్ర్టా్ల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఈ ఉగ్రకుట్రలు హైదరాబాద్ లోనూ ఉన్నాయని తేలింది. దీంతో అప్రమత్తం అయిన కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు నగరంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టి సయిదా బేగం అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను టూటౌన్ పోలీస్‌స్టేషన్‌ లో విచారించారు. ఈ ఉగ్ర లింకుల కేసులో సయిదా బేగం ప్రధాన పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం ఆమెను విజయవాడకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే  గత ఏడాదిజూన్ లో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ముగ్గురు అనుమానితులని అరెస్టు చేయడం తో అప్రమత్తం అయిన సయిదా బేగం తో పాటు మిగతా సానుభూతిపరులు అప్రమత్తమయ్యారు.. పోలీసులకు తమపై ఎటువంటి అనుమానం రాకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో "అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్" పేరుతో సంస్థను ఏర్పాటు చేసుకున్నారు.-- పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తపడ్డ 12మంది టెర్రరిస్టుల గ్యాంగ్-- హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా పేలుళ్లకు స్కెచ్‌ గీచినట్లు తెలిసింది.
  
 కాగా, ఈ ఉగ్రలింకులు . వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీ వరకు విస్తరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిని అదుపులోకి తీసుకున్న అధికారులు మిగిలిన వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తు్న్నారు.