Nizamabad : నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఉద్రిక్తత.. సెక్యూరిటీ అధికారిపై దాడి చేసి....

నిజామాబాద్ జిల్లా పసుపు మార్కెట్ లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యార్డుకు చెందిన సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్‌పై కార్మికులు దాడి చేశారు. తమపై పసుపు దొంగతనం ఆరోపణలు చేస్తున్నారంటూ కార్మికులు మండిపడ్డారు. పసుపు కాంటాలు నిలిపివేసి ఆందోళనకు దిగారు.

New Update
Nizamabad

Nizamabad

Nizamabad : నిజామాబాద్ జిల్లా పసుపు మార్కెట్ యార్డులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యార్డుకు చెందిన సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్‌పై కార్మికులు దాడి చేశారు. తమపై పసుపు దొంగతనం ఆరోపణలు చేస్తున్నారంటూ శ్రీనివాస్‌పై కార్మికులు మండిపడ్డారు. తమపై పసుపు దొంగతనం ఆరోపణలను నిరసిస్తూ పసుపు కాంటాలు నిలిపివేశారు. ఆనంతరం ఆందోళనకు దిగారు. యార్డులో వివిధ సంఘాలకు చెందిన పసుపు కార్మికులు యార్డు ఛైర్మన్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా దొంగతనం ఆరోపణలపై ఛైర్మన్‌ను నిలదీశారు. కార్మికులంతా పెద్దఎత్తున ధర్నా చేపట్టడంతో సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన యార్డుకు చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో మొహరించిన పోలీసులు మార్కట్ లో పరిస్థితి అదుపుతప్పకుండా ఆందోళన కారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్‌ను పోలీసులు అక్కడినుంచి తరలించే ప్రయత్నం చేశారు. 

Also Read: మోనాలిసా రేంజ్ మారింది.. మాల్ ఓపెనింగ్ లో డాన్సులతో సందడి.. వీడియో చూశారా!

మార్కెట్ యార్డులో పెద్ద ఎత్తున ధర్నాకు దిగిన కార్మికులు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీసు వాహనంలో ఉన్న  శ్రీనివాస్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అతన్ని బయటకు లాగి కొట్టే ప్రయత్నం చేశారు. కార్మికులు పెద్ద సంఖ్యలో ఉండడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు భారంగా మారింది. అయితే పోలీస్ వాహనాన్ని అడ్డుకోవడంతో మరింత ఉద్రిక్తత చెలరేగింది. అయితే  పోలీసులు తమ కారును అక్కడ్నుంచి వేగంగా పోనిచ్చారు. కార్మికుల ధర్నాతో మార్కెట్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ధర్నా నేపథ్యంలో పసుపు క్రయవిక్రయాలు ఆగిపోయాయి. పసుపు కాంటాలు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కొనుగొళ్లు ప్రారంభించాలని కోరుతున్నారు. గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్ యార్డులో పోలీసులు భారీగా మోహరించారు. అయితే కార్మికుల ఆందోళనను విరమింప చేయడానికి మార్కెట్ కమిటి ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా కార్మికుల పట్ల దురుసుగా ప్రయత్నించిన సెక్యూరిటీ అధికారిని విధుల్లోంచి తొలకించాలని కార్మికులు డిమాండ్ చేయడంతో ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు.

Also Read: మోనాలిసా రేంజ్ మారింది.. మాల్ ఓపెనింగ్ లో డాన్సులతో సందడి.. వీడియో చూశారా!

Advertisment
Advertisment
Advertisment