/rtv/media/media_files/2025/01/18/0KlxYRjU7cuR6IrDuL1E.jpg)
weather TG Photograph: (weather TG)
TG Weather Updates: తెలంగాణాలో చలి చుక్కలు చూపిస్తోంది. గతకొన్ని రోజులుగా చలితీవ్రత పెరుగుతుండగా.. జనవరి 18 (శనివారం)న ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో అత్యల్పంగా 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో వరుసగా ఉష్ణోగ్రతలు 15.8 డిగ్రీలు, 17.2 డిగ్రీలకు పడిపోయాయి. సంగారెడ్డి, ఉమ్మడి ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. శనివారం వరకు ఉష్ణోగ్రతలు స్ప ల్పంగా పెరుగుతాయని, ఉదయం పొగమంచుతోపాటు ఆ కాశం మేఘావృతమై ఉంటుందని అధికారులు తెలిపారు.
Also Read: బాబా సజీవ సమాధి తవ్వకుండా అడ్డుకున్న ఫ్యామిలీ.. పోలీసుల విచారణలో బిగ్ ట్విస్ట్
తెలంగాణాలో చలికి చుక్కలే...! TG Weather Updates
నల్గొండలో 17.4, హైదరాబాద్‌లో 18.6 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. శీతాకాలం మరో నెల రోజులు ఉండటంతో ఇంకా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలి తీవ్రత నుంచి రక్షించుకునేందుకు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండు రోజుల క్రితం 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో రానున్న మూడ్రోజులపాటు ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Also Read: ఏపీకి గుడ్‌న్యూస్.. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 ప్యాకెజీ