TG Weather
TG Weather: హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణ మారిపోయింది. వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భాగ్యనగర్ ప్రజలకు ఒక్కసారిగా ఉపశమనం కలిగింది. హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, ఫిల్మ్‌నగర్, హైటెక్ సిటీ, కొండాపూర్, లింగంపల్లి, మియాపూర్, మదీనా గూడ, చందానగర్ తదితర ప్రాంతాల్లో ఉరుముల, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌తోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షం పడుతోంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వర్షం పడుతోంది.
జాగ్రత్తగా ఉండాలి:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అకాల వర్షాలు పడటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ అధికారులు ప్రజలను అలెర్ట్ చేసింది. రాబోయే రెండు రోజులు తెలంగాణ వ్యాప్తంగా వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌తోపాటు, ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, హన్మకొండ, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: పిల్లలు భోజనం చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఇస్తే జరిగేది ఇదే
కొన్ని సంగారెడ్డి, నారాయణఖేడ్‌లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం, మరి కొన్ని జిల్లాలో వడగళ్ల వర్షం పడింది. భారీ వర్షంతో తెలంగాణలో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. భారీ వర్షం కారణంగా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. అవసరం అయితేనే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్నదున 2,3 రోజులు రైతులు పొలం పనులకు వెళ్లొద్దని చెప్పారు. జీహెచ్ఎంసీలో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. కరెంట్ పోల్స్‌కు దూరంగా ఉండాలంటున్నారు.
ఇది కూడా చదవండి: కాల్చిన అవిసె గింజలతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
( ts-weather | ts-weather-update | latest-news)