/rtv/media/media_files/2025/03/25/6oPhQgWQcXe8p7JHMmLG.jpg)
BRS Ex MLA Mallareddy
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డికి రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ నియోజకవర్గంలోని ఘట్కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేసింది. ఈ రోజు మల్లారెడ్డి డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. 14 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఘట్కేసర్ ఫ్లైఓవర్ పనులు ప్రారంభించాలని కోరారు. ఈ మేరకు వినతి పత్రం అందించారు. స్పందించిన మంత్రి వెంటనే రూ.50 లక్షలు మంజూరు చేశారు. దీంతో భట్టి విక్రమార్కకు మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: ట్రంప్‌కు బిగ్ షాక్.. అమెరికా సీక్రెట్స్ లీక్.. అసలేం జరిగిందంటే?
మీడియాతో మల్లారెడ్డి చిట్ చాట్..
ఇదిలా ఉంటే.. ఈ రోజు అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. పార్లమెంట్ లో ఆనాడు వాజ్ పేయి లాంటి వారు మాట్లాడుతుంటే దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసేవారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకులు సభలో మాట్లాడుతుంటే ప్రజలు టీవీలకు హత్తుకొని పోయేవారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అసెంబ్లీలో కేసీఆర్ ఏం మాట్లాడతారని ప్రజలకు ఆసక్తి ఉండేదన్నారు. నేడు అసెంబ్లీలో బట్టలు విప్పుడు, కత్తులు దూసుడే కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: AP Man : అమెరికాలో ఆంక్షలు.. ఏపీ యువకుడు ఆత్మహత్య!
నమస్తే మంత్రిగారూ.. వివేక్ తో మల్లారెడ్డి జోకులు..
అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎదురు పడ్డారు. వివేక్ వెంకటస్వామిని నమస్తే మంత్రి గారు అని మల్లారెడ్డి పలకరించారు. థాంక్స్ మల్లన్న అని వివేక్ నవ్వుతూ బదులిచ్చారు. రాష్ట్రంలో కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఫ్యామిలీ, వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీల హవానే నడుస్తుందన్నారు మల్లారెడ్డి. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్, మల్లారెడ్డి హవానే నడిచిందని వివేక్ వెంకటస్వామి నవ్వుతూ కౌంటర్ ఇచ్చారు.
(brs mla mallareddy | latest-news | telugu-news | telugu breaking news)