Kavitha Baibata : నేటి నుంచి తెలంగాణ రక్షణసేన సింగరేణి బాయిబాట

సింగరేణి బొగ్గు గనుల కార్మికులు, స్థానిక ప్రజలకు మరింత చేరువయ్యేందుకు తెలంగాణ రక్షణ సేన (TRS) అగ్రనేత, కల్వకుంట్ల కవిత సరికొత్త కార్యాచరణతో ముందుకు వచ్చారు. సోమవారం నుంచి ఆమె ప్రతిష్టాత్మక ‘సింగరేణి బాయిబాట’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

New Update
kavitha

Kavitha Singareni Baibata

Kavitha Baibata : సింగరేణి బొగ్గు గనుల కార్మికులు, స్థానిక ప్రజలకు మరింత చేరువయ్యేందుకు తెలంగాణ రక్షణ సేన (TRS) అగ్రనేత, కల్వకుంట్ల కవిత సరికొత్త కార్యాచరణతో ముందుకు వచ్చారు. సోమవారం నుంచి ఆమె ప్రతిష్టాత్మక ‘సింగరేణి బాయిబాట’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సింగరేణి ప్రాంతాల్లోని సమస్యలను నేరుగా తెలుసు కోవడంతో పాటు, కార్మిక లోకంతో మమేకం కావడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. ఈ నెల 20వ తేదీ వరకు (మొత్తం ఆరు రోజుల పాటు) సుదీర్ఘంగా సాగే ఈ కార్యక్రమం కోసం పార్టీ శ్రేణులు, కార్మిక సంఘాలు ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేశాయి.ఈ 'బాయిబాట' మొదటి విడత పర్యటనలో భాగంగా ఆరు రోజుల్లో ఐదు కీలక అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని బొగ్గు గనుల ప్రాంతాలను కవిత సందర్శించనున్నారు.

షెడ్యూల్ ప్రకారం.. సోమవారం (తొలిరోజు) చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని మందమర్రి బొగ్గు గనుల ప్రాంతంలో ఆమె పర్యటిస్తారు. అనంతరం జూన్ 16న మంచిర్యాల నియోజకవర్గంలోని శ్రీరాంపూర్ పరిధిలో, జూన్ 17న రామగుండం నియోజకవర్గంలోని ఆర్‌జీ-1 (RG-1) ప్రాంతంలో ఆమె పర్యటన కొనసాగుతుంది. జూన్ 18 రామగుండంఆర్‌జీ-2 (RG-2),జూన్ 19 మంథని అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్, ఆర్‌జీ-3 ప్రాంతం, జూన్ 20న భూపాలపల్లి భూగర్భ, ఓపెన్ కాస్ట్ (OC) గనుల ప్రాంతంలో పర్యటిస్తారు.

 ఈ సందర్భంగా ఆయా నియోజకవర్డా్ల్లోని భూగర్భ బొగ్గు గనులు, ఓపెన్ కాస్ట్ గనుల వద్దకు వెళ్లి నేరుగా కార్మికులతో సమావేశం కానున్నారు. ఈ ఆరు రోజుల పర్యటనలో కవిత కార్మికుల పనితీరును, వారి నివాస ప్రాంతాల్లోని మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. గనుల లోపల, వెలుపల కార్మికులు ఎదుర్కొంటున్న సవాళ్లు, సంక్షేమ పథకాల అమలుపై వారితో ముఖాముఖి చర్చించి, వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వనున్నట్లు టీఆర్‌ఎస్ పార్టీ ప్రతినిధులు వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు