/rtv/media/media_files/2025/08/19/rains-2025-08-19-07-59-05.jpg)
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. తెలంగాణలో రాగల మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్‌లు జారీ చేసింది.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా కదులుతున్నాయని, రాబోయే నాలుగైదు రోజుల్లో ఇవి రాష్ట్రమంతటా విస్తరిస్తాయని అధికారులు పేర్కొన్నారు.
భారీ వర్షాలతో పాటు
ఇవాళ, రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది. వాతావరణం అనుకూలించని కారణంగా ప్రజలు తమ దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని హెచ్చరించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
మరోవైపు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు తెగబాదుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో, వాతావరణ శాఖ తీవ్రతను బట్టి కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలకు సిద్ధంగా ఉంది.
Follow Us