పొంగులేటి చెప్పిన పొలిటికల్ బాంబ్ ఏంటి? కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ అవుతారా? మరో ఒకటి రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలుతాయంటూ మంత్రి పొంగులేటి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుతు కొనుగోళ్లలో అవకతవకలు, ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించి కీలక నేతలు అరెస్ట్ లు ఉండొచ్చనే చర్చ సాగుతోంది. By Nikhil 25 Oct 2024 in తెలంగాణ ఖమ్మం New Update షేర్ చేయండి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. మరో ఒకటి రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలుతాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తాను హైదరాబాద్ కు వెళ్లిన మరుసటి రోజే ఈ పొలిటికల్ బాంబులు పేలుతాయని సియోల్ పర్యటనలో ఇచ్చిన ఇంటర్వ్యూలో పొంగులేటి వ్యాఖ్యానించారు. ధరణి పోర్టల్, కాళేశ్వరం ప్రాజెక్ట్, టెలిఫోన్ ట్యాపింగ్ తో పాటు మొత్తం 10 అంశాల్లో గత ప్రభుత్వం చేసిన తప్పులపై తాము ఎంక్వైరీ చేస్తున్నామన్నారు. సరైన ఆధారాలతో నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఈ రోజు పొంగులేటి సియోల్ పర్యటన నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. దీంతో ఎవరి అరెస్ట్ జరగబోతోంది? అన్న అంశం ఉత్కంఠగా మారింది.ఇది కూడా చదవండి: Kishan Reddy: దమ్ముంటే కూల్చు.. రేవంత్ కు కిషన్ రెడ్డి సంచలన సవాల్! ఆ చర్చకు బ్రేక్.. అయితే.. టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన ప్రభాకర్ రావు హైదరాబాద్ కు వచ్చారని.. ఆయన కోర్టులో లొంగిపోబోతున్నారనే ప్రచారం నిన్న రాత్రి నుంచి జోరుగా సాగింది. ఆయన చెప్పే వివరాల ఆధారంగా అరెస్టులు ఉంటాయన్న టాక్ నడిచింది. అయితే.. ప్రభాకర్ రావు అసలు హైదరాబాద్ కే రాలేదని హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. దీంతో ఈ చర్చకు బ్రేక్ పడింది. దీంతో మరెవరి అరెస్టు ఉండబోతుందనే అంశంపై చర్చ సాగుతోంది. ప్రస్తుతం కాళేశ్వరంతో పాటు విద్యుత్ కొనుగోళ్లపై చర్చ సాగుతోంది. ఇంకా ఫోన్ ట్యాపింగ్ పై సైతం విచారణ కీలక దశకు చేరుకుంది. మరో వైపు గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా రేసులో సైతం అక్రమాలు జరిగాయని రేవంత్ సర్కార్ చెబుతోంది. ఈ అంశంపై సైతం ఏసీబీ సైతం రంగంలోకి దిగనుంది. ఇవన్నీ గత కేసీఆర్ ప్రభుత్వ హాయంలో జరిగినవే కావడం గమనార్హం. తాను జైలుకు వెళ్లానికి సిద్ధమని నిన్న అదిలాబాద్ మీటింగ్ లో కేటీఆర్ వ్యాఖ్యానించడం సైతం చర్చనీయాశమైంది. పొంగులేటి కామెంట్ల నేపథ్యంలోనే ఆయన ఇలా అన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.ఇది కూడా చదవండి: చేసిందంతా కేసీఆరే.. కాళేశ్వరం విచారణలో సంచలన విషయాలు! ఒకట్రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలబోతున్నై-మంత్రి పొంగులేటిజైలుకెళ్లేందుకు సిద్ధం - కేటీఆర్వీళ్ల మాటల వెనక మర్మమేంటో..?#Ponguleti #KTR #TelanganaPolitics pic.twitter.com/ZRby5vHJMU — Devika Journalist (@DevikaRani81) October 24, 2024 కేసీఆర్ మెడకు కాళేశ్వరం ఉచ్చు.. నిన్న కాళేశ్వరం విచారణకు హాజరైన అధికారులంతా ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియా అంతా కేసీఆరేనని స్పష్టం చేశారు. ఇంకా ఫోన్ ట్యాపింగ్ విషయంలోనూ కేసీఆర్, కేటీఆర్ పేర్లే వినిపిస్తున్నాయి. ఇంకా విద్యుత్ కొనుగోళ్లు కూడా కేసీఆర్ మెడకే చుట్టుకునే ప్రమాదం ఉందన్న చర్చ సాగుతోంది. మరోవైపు కేసీఆర్ హయాంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పని చేసిన ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ను ఈడీ విచారిస్తోంది. మంత్రి ఎర్రబెల్లి కుటుంబ సభ్యులతో పాటు కేటీఆర్ ఫ్యామిలీకి చెందిన మరికొందరికి మేలు జరిగేలా అమోయ్ కుమార్ అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా ఏ కేసులో చూసినా కేసీఆర్, కేటీఆర్ పేర్లే వినిపిస్తున్నాయి. దీంతో పొంగులేటి చెప్పిన పొలిటికల్ బాంబ్ ఏంటి? ఈ కేసుల్లో కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అరెస్ట్ అవుతారా? అన్న అంశంపై ఉత్కంఠ సాగుతోంది. మరో ఒకటి రెండు రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పొంగులేటి చెప్పిన బాంబుల గురించి... కేటీఆర్ స్పందన.. pic.twitter.com/mDdxfhZbUL — Prabhakar Venavanka (@Prabhavenavanka) October 25, 2024 కేటీఆర్ సెటైర్లు.. ఇదిలా ఉంటే.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీపావళిలోపు బాంబు పేలుతుంది అంటూ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. బాంబు అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన మీద జరిగిన ఈడీ దాడుల మీద ఎమైనా చెబుతాడేమోనని ఎద్దేవా చేశారు. ఈడీ దాడుల్లో ఎన్ని నోట్ల కట్టలు దొరికాయో చెప్పొచ్చంటూ సెటైర్లు వేశారు. #ktr #kcr #minister-ponguleti-srinivas-reddy #kaleshwaram-poject మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి