new ration cards
Telangana: తెలంగాణ సర్కారు ఈనెల 26న నాలుగు పథకాలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా పథకాలకు అర్హులైన లబ్ధిదారుల కోసం ఎంపిక జరుగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అధికారులు కొత్త రేషన్ కార్డు అర్హుల జాబితాను రూపొందించారు. అయితే ఈ జాబితాలో అర్హులైన చాలా మంది పేర్లు లేవని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కార్డుకు కావాల్సిన అర్హతలు అన్నీ ఉన్నప్పటికీ.. తమ పేర్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Kiran Abbavaram: తండ్రి కాబోతున్న మరో టాలీవుడ్ హీరో.. సోషల్ మీడియాలో పోస్ట్ !
కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు..
ఈ మేరకు సంబంధిత మంత్రి శాఖ కీలక ప్రకటన చేసింది. లిస్టులో పేర్లు లేకపోయినా ఆందోళ చెందాల్సిన అవసరం లేదని. పేర్లు లేని వారి కోసం మళ్ళీ దరఖాస్తు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. నేటి నుంచి ఈనెల 24 వరకు జాబితాలో పేర్లు రానివారు ప్రజావాణి, గ్రామసభల్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. కొత్త కార్డులతో పాటు కార్డుల్లో మార్పుల కోసం దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపారు. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు కోసం ప్రభుత్వం రూపొందించిన ధరఖాస్తు ప్రతాన్ని ఫిల్ చేసి గ్రామసభల్లో అందజేయాలి. కుటుంబ పెద్ద, ఇతర సభ్యుల ఆధార్ కార్డుల వివరాలు, అడ్రస్, ఫోన్ నంబర్, కులానికి సంబంధించిన వివరాలు అందులో నమోదు చేయాలని సూచించారు. అప్లికేషన్లను పరిశీలించి అర్హులకు రేషన్ కార్డులను అందించనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు
— Preetham Nagarigari (@Preetham_INC) January 20, 2025
పాత రేషన్ కార్డులు యథాతథం
కొత్త కార్డుల జారీకి ప్రాథమిక జాబితా
జాబితాలో పేరులేని వారు గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చు
కొత్త దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 21 నుండి 24 వరకు#preethamnagarigari pic.twitter.com/r2PfWQ9vku
ఈ సందర్భంగా పీఎస్ శాంతి కుమారి కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 11,65,052 సంబంధించిన 6,68,309 కార్డుల సమాచారాన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు. మరో 1.36 కోట్ల జనాలకు సంబంధించిన 41.25 లక్షల కార్డుల సమాచారాన్ని అవసరం మేరకు తెలియజేస్తామని వెల్లడించారు.
Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?