/rtv/media/media_files/2025/04/03/7eMSv5nrUqq5nZgimg5W.jpg)
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీని తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఈ రోజు కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కొండా సురేఖ ఈ రోజు ఈ ఇద్దరు అగ్రనేతలతో భేటీ కావడం చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిణామాలు, సమకాలీన అంశాలపై వీరితో చర్చించినట్లు కొండా సురేఖ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. అయితే.. తెలంగాణ కేబినెట్ విస్తరణ, మంత్రివర్గంలో మార్పు చేర్పుల నేపథ్యంలోనే సురేఖ హైకమాండ్ పెద్దలను కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ జరిగితే కొండా సురేఖతో పాటు, జూపల్లి కృష్ణారావును తప్పిస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: PM Modi: బ్యాంకాక్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. ఎందుకెళ్లారంటే ?
సురేఖపై హైకమాండ్ సీరియస్?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నాగార్జున ఫ్యామిలీపై కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా ఉందని తెలుస్తోంది. ఆమె వ్యాఖ్యలు పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చాయని నాయకత్వం భావిస్తుందన్న ప్రచారం చాలా రోజులుగా ఉంది. ఇంకా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ముఖ్యనేతలతో సురేఖకు పడడం లేదు. రేవూరి ప్రకాష్ రెడ్డితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు తమను సురేఖ వేధిస్తున్నారని ఇప్పటికే హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. తమ నియోజకవర్గాల్లో ఆమె అనవసరంగా వేలు పెడుతున్నారని నాయకత్వం వద్ద మొర పెట్టుకున్నారు. దీంతో సురేఖను కేబినెట్ నుంచి తప్పించడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది.
ఇది కూడా చదవండి: BIG BREAKING: HCU భూవివాదంలో సుప్రీం కోర్టు సీరియస్.. ‘ఏం జరిగినా పూర్తి బాధ్యత సీఎస్ దే’
ఈ నేపథ్యంలోనే సురేఖ హైకమాండ్ పెద్దలను కలిసి తన పదవి నుంచి తొలగించవద్దని కోరినట్లు తెలుస్తోంది. కేసీఆర్, కేటీఆర్, కవిత, బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను తాను బలంగా తిప్పికొడుతున్నానని వివరించినట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ భారీగా సీట్లను సాధించడంలో తన పాత్ర ఉందని వివరించినట్లు తెలుస్తోంది. తన సొంత నియోజకవర్గం పరకాలతో పాటు భూపాలపల్లి, వర్ధన్నపేట, పాలకుర్తి, జనగామలో పార్టీ విజయానికి తన భర్త మురళి కృషి చేశారని చెప్పినట్లు సమాచారం. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని తనను మంత్రిగా కొనసాగించాలని కోరినట్లు ప్రచారం సాగుతోంది.
(konda-surekha | sonia-gandhi | telugu-news | telugu breaking news)